Deviyani Sharma: దేవియాని శర్మ డ్రెస్ సైజ్ రోజు రోజుకీ తగ్గిపోతోంది కానీ ఆఫర్స్ నంబర్ పెరగడం లేదు!
రెండు వెబ్ సిరీసులతో టాలీవుడ్ లో పాపులర్ అయింది దేవియాని శర్మ. ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ నవీన్ చంద్ర నటించిన భానుమతి రామకృష్ణ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది...
ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించి మెప్పించింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది కానీ చెప్పుకోదగిన హిట్ పడలేదు.
సేవ్ ది టైగర్స్, సైతాన్ వెబ్ సిరీసులతో మంచి ఫ్యాన్ బేస్ ఏర్పాటుచేసుకుంది. ఇక సేవ్ ది టైగర్స్ సిరీస్ లో హై ప్రొఫైల్ ఫెమినిస్ట్ లాయర్ గా నటించింది. సైతాన్ వెబ్ సిరీస్ లో జయప్రదగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన దేవియాని బాలీవుడ్ మూవీస్ లోనూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత ఆవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ కి వచ్చేసింది. ఇప్పుడు ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లతో బిజీ అయ్యే ప్రయత్నంలో ఉంది.
పరీక్షించుకుంటోంది దేవియాని శర్మ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దేవియాని శర్మ లేటెస్ట్ ఫొటోస్ ఇవి...
దేవియాని శర్మ (Image Courtesy: deviyyani/ Instagram)