Malavika Mohanan: ప్రభాస్ 'ది రాజా సాబ్' సెట్‌లో మాళవిక బర్త్ డే సెలబ్రేషన్స్ - ఫైనల్లీ అసలు విషయం చెప్పారుగా
Malavika Mohanan Birthday Celebrations: ఫోటో చూస్తే... దర్శకుడు మారుతి బర్త్ డే అన్నట్టు ఉంది కదూ! అంటే... ఆయనకు కేక్ తినిపిస్తుంది కాబట్టి! కానీ... పుట్టినరోజు మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ ది. 'ది రాజా సాబ్' సినిమా సెట్‌లో సెలబ్రేషన్స్ జరిగాయి.
The Raja Saab team officially welcomes Malavika Mohanan on board: 'ది రాజా సాబ్' సినిమాలో మాళవికా మోహనన్ ఒక హీరోయిన్. ఆవిడ షూటింగ్ స్టిల్స్, ఫైట్ సీక్వెన్స్ చేసిన వీడియోస్ నెట్టింట లీక్ అయ్యాయి కూడా! అయితే... ఇవాళ ఆమె అధికారికంగా 'ది రాజా సాబ్' టీమ్ తమ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పింది. తమ చిత్ర బృందంలోకి స్వాగతించింది.
దర్శకుడు మారుతితో 'ది రాజా సాబ్' సెట్‌లో హీరోయిన్ మాళవికా మోహనన్. ఆమె కాకుండా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ సైతం సినిమాలో నటిస్తున్నారు.
మాళవికా మోహనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో 'ది రాజా సాబ్' టీమ్. కేక్ కట్ చేస్తున్న ముద్దుగుమ్మ. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.