Deepthi Sunaina : హాయిగుంటే చాలట.. వెయ్యి మాటలు అవసరమేలేదంటుంది దీప్తీ సునయన
దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలు షేర్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
రెడ్, బ్లాక్ కలర్ డ్రెస్‌లో మెరుస్తూ.. ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది దీప్తి సునయన. వాటికి అభిమానులు క్యూట్‌గా ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/deepthi_sunaina)
ఈ ఫోటోలకు తగ్గట్లుగా ఓ మంచి సాంగ్‌ని సెట్ చేసింది. ఆ సాంగ్‌లోని లిరిక్స్‌ను క్యాప్షన్‌గా పెట్టింది. హాయిగుంటె చాలునండి వెయ్యిమాటలెందుకండి అనే ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు అనే సినిమాలోని సాంగ్ లిరిక్స్ పోస్ట్ చేసింది.(Images Source : Instagram/deepthi_sunaina)
దీప్తి సునయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. టిక్‌టాక్ సమయం నుంచి ఆమె సోషల్ మీడియాలో ఓ రేంజ్లో పాపులారిటీ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
యూట్యూబ్‌లో పలు డ్యాన్స్ వీడియోలు చేస్తూ ఎందరో అభిమానులను సంపాదించుకుంది. ఈ ఫేమ్తోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో పలు కాంట్రవర్సీలకు తెరలేపింది.(Images Source : Instagram/deepthi_sunaina)
బిగ్‌బాస్ అనంతరం తన కెరీర్‌ను ఆచితూచి ముందుకు తీసుకెళ్తుంది. పలు వీడియో సాంగ్‌లలో నటిస్తూ.. మంచి క్రేజ్ సంపాదించుకుంది.(Images Source : Instagram/deepthi_sunaina)
ప్రస్తుతం ఈ భామ సింగిల్‌గా ఉంటున్నట్లు తెలిపింది. గతంలో షణ్ముక్‌తో ప్రేమాయణం నడిపింది. షణ్ముక్ బిగ్‌బాస్ నుంచి వచ్చాక వీరిద్దరూ తమ రిలేషన్‌కు బ్రేకప్ చెప్తున్నామంటూ సోషల్ మీడియాలో వెల్లడించారు.(Images Source : Instagram/deepthi_sunaina)