Deepika Padukone: దీపికా పదుకోన్... జిల్ జిల్ జిగేల్ అనేలా!
ముంబైలో బుధవారం రాత్రి '83' మూవీ ప్రీమియర్ షో జరిగింది. హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు, క్రికెటర్లు చాలామంది అటెండ్ అయ్యారు. అయితే... అందరిలోనూ దీపికా పదుకోన్ స్పెషల్ అని చెప్పాలి. తన అందంతో, స్టైలిష్ డ్రస్‌తో అందరి నోట అదుర్స్ అనిపించారు. ముఖ్యంగా ఆమె మెడలో నగ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. (Image Credit: Instagram/Deepika Padukone)
దీపికా పదుకోన్ ఫొటోల కింద భర్త రణ్‌వీర్ సింగ్ 'ఉఫ్' అని కామెంట్ చేశారు. హీరోయిన్లు సోనాక్షి సిన్హా, అనుష్కా శర్మ, అదితి రావ్ హైదరి తదితరులు కాంప్లిమెంట్స్ ఇస్తూ కామెంట్స్ చేశారు. (Image Credit: Instagram/ Deepika Padukone)
'83' ప్రీమియర్ షోకి వెళ్లడానికి ముందే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పోస్ట్ చేశారు దీపికా పదుకోన్. అప్పుడే ఆమె ఏ లుక్‌లో ప్రీమియర్‌కు అటెంట్ అవుతున్నారనేది అర్థం అయ్యింది. (Image Credit: Instagram/ Deepika Padukone)
'83' సినిమా డిసెంబర్ 24న విడుదల కానుంది. దీనికి దీపికా పదుకోన్ ఓ నిర్మాత. దీని తర్వాత శకున్ బత్రా దర్శకత్వం వహించిన 'గేహరియాన్'తో ఓటీటీ వీక్షకుల ముందుకు రానున్నారు. అందులో సిద్ధాంత్ చతుర్వేది, అనన్యా పాండే కూడా నటించారు. (Image Credit: Instagram/ Deepika Padukone)