Tanishq Rajan : 'నేనెవరో' అంటోన్న 'కమిట్‌మెంట్' భామ - ప్రేక్షకుల ప్రేమ కోసమే ఈ కష్టమంతా!
'శరణం గచ్చామి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఉత్తరాది భామ తనిష్క్ రాజన్. అంతకు ముందు ఆమె థియేటర్ ఆర్టిస్ట్. నాలుగేళ్ల వయసులో బాలనటిగా నాటకాలు వేయడం స్టార్ట్ చేశారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
చిన్నప్పుడు పలు నాటకాలు వేసిన తనిష్క్ రాజన్, పన్నెండేళ్ల వయసులో సోదరితో కలిసి ముంబైకి వెళ్లారు. అప్పుడు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
మొదట టీవీ యాడ్స్ చేసిన తనిష్క్ రాజన్, ఆ తర్వాత తెలుగు సినిమాలో కథానాయికగా చేసే అవకాశం రావడంతో హైదరాబాద్ వచ్చారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
'శరణం గచ్చామి' తర్వాత 'దేశంలో దొంగలు పడ్డారు', 'ఇష్టంగా', 'బైలంపూడి' సినిమాల్లో నటించారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
తనిష్క్ రాజన్ నటించిన లాస్ట్ సినిమా 'కమిట్‌మెంట్'. అది ఆమెకు గుర్తింపు తెచ్చింది. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
ఇప్పుడు 'నేనెవరో' సినిమాతో తనిష్క్ రాజన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డిసెంబర్ 2న ఆ సినిమా విడుదల అవుతోంది. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నానని తనిష్క్ రాజన్ తెలిపారు. ఇటీవల 'దో లోగ్' అనే ప్రైవేట్ ఆల్బమ్ చేశారు. యూట్యూబ్‌లో దానికి మంచి స్పందన లభించింది. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
శాస్త్రీయ సంగీతం, నృత్య కళల్లోనూ తనకు ప్రావీణ్యం ఉందని తెలిపిన తనిష్క్ ... ప్రేక్షకుల ప్రేమ పొందడం కోసమే ఈ కష్టమంతా అని చెప్పుకొచ్చారు. (Image Courtesy : tanishqrajanofficial / Instagram)
తనిష్క్ రాజన్ కొత్త ఫోటోలు (Image Courtesy : tanishqrajanofficial / Instagram)