Veede Mana Varasudu: రైతే వారసుడు... జూలైలో రైతులు - డ్రగ్స్ మీద తీసిన సినిమా
రైతుల జీవితాల మీద రూపొందిన సందేశాత్మక సినిమా 'వీడే మన వారసుడు'. రమేష్ ఉప్పు (RSU) కథానాయకుడిగా నటించడంతో పాటు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆయనే రచయిత కూడా! లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సమ్మెట గాంధీ, విజయ రంగరాజు, ఆనంద్ భారతి, గూడూరు కిషోర్, శిల్ప (వైజాగ్) ప్రధాన తారాగణం. తాజాగా సినిమా విడుదల తేదీ అనౌన్స్ చేశారు.
జూలై 18న రెండు తెలుగు రాష్ట్రాలలో 'వీడే మన వారసుడు' విడుదల చేస్తున్నట్లు రమేష్ ఉప్పు తెలిపారు. ఇటీవల సెన్సార్ పూర్తి చేశామని, సెన్సార్ సభ్యుల నుంచి ప్రశంసలు అందుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
కుటుంబ అనుబంధాలతో పాటు రైతులు చేస్తున్న పోరాటాలు, యువత మీద డ్రగ్స్ ఎటువంటి ప్రభావం చుపిస్తున్నాయనే అంశాలను సినిమాలో చూపించామని... ప్రేక్షకులకు చక్కటి సందేశం అందించే చిత్రమిదని రమేష్ ఉప్పు తెలిపారు. ఈ నెల 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నామని ఆయన చెప్పారు.
రమేష్ ఉప్పు హీరోగా, లావణ్య రెడ్డి, సర్వాణి మోహన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నిర్మాణ సంస్థ: ఆర్.ఎస్ ఆర్ట్స్, కెమెరా: డి. యాదగిరి, కూర్పు: కె. శ్రీనివాస రావు, స్వరాలు: సదివే దేవేంద్ర, నేపథ్య సంగీతం: శ్రీ వెంకట్.