Double Ismart Trailer: డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ రిలీజ్ ఈ రోజే - ఎన్నింటికో తెలుసా?
Double Ismart trailer release date time: ఆదివారం సాయంత్రం 7.33 గంటలకు... విశాఖలోని గురజాడ కళాక్షేత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ విడుదల చేయనున్నారు.
Double Ismart release date: ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'డబుల్ ఇస్మార్ట్' థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్. ఆల్రెడీ విడుదల చేసిన 'స్టెప్పా మార్', 'మార్ ముంత చోడ్ చింత','క్యా లఫడా' పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది.
'డబుల్ ఇస్మార్ట్'లో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయనది విలన్ రోల్ అని టాక్. 'ఇస్మార్ట్ శంకర్' భారీ హిట్ సాధించిన నేపథ్యంలో 'డబుల్ ఇస్మార్ట్' మీద మంచి అంచనాలు ఉన్నాయి.
పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించడంతో పాటు ఛార్మి కౌర్ తో కలిసి 'డబుల్ ఇస్మార్ట్' సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధినేతలు నిరంజన్ రెడ్డి - చైతన్య రెడ్డి దంపతులు వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడు.