Sreeleela: వేవ్స్ సమ్మిట్ అద్భుతం - ప్రధాని మోదీ స్పీచ్‌పై శ్రీలీల ప్రశంసలు
ముంబై వేదికగా 'వేవ్స్ 2025' సమ్మిట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ సహా పలువురు స్టార్ హీరోస్ హాజరయ్యారు.
భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హీరోయిన్ శ్రీలీల సైతం వేవ్స్ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో భారతదేశాన్ని గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతోనే కేంద్ర ప్రభుత్వం వేవ్స్ 2025కు నాంది పలికిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ స్పీచ్ తనకెంతో నచ్చిందని, చాలా అద్భుతంగా ఉందని శ్రీలీల అన్నారు.
వాణిజ్యంలో పెట్టుబడి పెట్టమని ప్రధాని మోదీ చెప్పిన విధానం తనకు బాగా నచ్చిందని శ్రీలీల తెలిపారు. వేవ్స్ సమ్మిట్ అద్భుతంగా ఉందని నిర్వాహకులను ఆమె ప్రశంసించారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. శ్రీలీల రీసెంట్ మూవీ రాబిన్ హుడ్ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శివకార్తికేయన్‌తో కలిసి పరాశక్తి, అఖిల్ అక్కినేనితో లెనిన్, మాస్ మహారాజ రవితేజతో 'మాస్ జాతర' ప్రాజెక్టులు ట్రాక్‌లో ఉన్నాయి.