Shraddha Das: హాట్ బ్యూటీ శ్రద్దదాస్ న్యూ అవతార్ - సమంతను ఫాలో అవుతుందా?
Sharddha Das Latest Photos: హాట్‌బ్యూటీ బ్యూటీ శ్రద్దదాస్ తాజాగా కొత్త అవతార్‌లో దర్శనం ఇచ్చింది. షూటింగ్స్, షోస్ పక్కన పెట్టి నేచర్‌ను ఆస్వాధిస్తుంది.
ఎప్పుడూ ట్రెండీ, ఫ్యాన్సీ వేర్‌లో ఆకట్టుకునే శ్రద్దా దాస్ తాజాగా సింపుల్ లుక్‌లో ఫోటోలు షేర్ చేసింది. యోగా, మెడిటేషన్ చేస్తున్న ఫోటోలు షేర్ చేసింది.
Bali dump..A beautiful Yoga retreat and a little dash of happiness!(బాలి డంప్..ఒక అందమైన యోగా తిరోగమనం మరియు కొంచెం ఆనందం!) అంటూ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం శ్రద్దాదాస్ ఫోటోలు తన ఫ్యాన్స్, ఫాలోవర్స ఆకట్టుకుంటున్నాయి. వీటితో పాటు ఈ వెకేషన్‌లో సమంత ఐటెం సాంగ్ ఊ అంటావా మావా ఊహు అంటావా పాటలకు స్టెప్పులు కూడా వేసింది.
ఇవి చూసిన నెటిజన్ల సడెన్‌గా శ్రద్ధ సమంతలా మారిపోయిందేంటని, ఏంటీ సమంతను ఫాలో అవుతుందా? అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రద్దదాస్ సందడి ఎక్కువైన సంగతి తెలిసిందే.
తరచూ గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లు, ఫాలోవర్స్‌ని ఆకట్టుకుంటుంది. సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత స్టార్ హీరోలు, పెద్ద సినిమాల్లో నటించింది.
ఇందులో తన అందం, గ్లామర్‌తో ఫిదా చేసింది. కానీ, పెద్దగా గుర్తింపు పొందలేకపోయింది. సెకండ్ హీరోయిన్, సహానటి పాత్రలు చేస్తూ కెరీర్‌లో ముందుకు వెళుతుంది. అయితే ఈ మధ్య ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గడంతో టీవీ షోలో సందడి చేస్తుంది. రీసెంట్‌గా ఆమె ఈటీవీ డ్యాన్స్ షో ఢీకి జడ్జీగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.