Sholay Actors Remuneration: అమితాబ్ కంటే ఆయనకు ఎక్కువ ఇచ్చారు... 'షోలే' యాక్టర్స్ రెమ్యూనరేషన్స్ తెలుసా?
'షోలే' సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ నటన బాగా పేరు తెచ్చుకుంది. బిగ్ బీ జయ్ పాత్ర పోషించారు. అలాగే వీరూ పాత్రలో ధర్మేంద్ర నటించారు.
ఇండియా డాట్ కామ్ నివేదిక ప్రకారం... 'షోలే'లో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు అమితాబ్ బచ్చన్ కాదు, ధర్మేంద్ర. అతనికి వీరూ పాత్ర కోసం 1.5 లక్షల రూపాయలు లభించాయి.
'షోలే' సినిమాలో ఠాకూర్ బల్దేవ్ సింగ్ పాత్రను సంజీవ్ కుమార్ పోషించారు. ఈ సినిమా కోసం ఆయనకు 1.25 లక్షల రూపాయలు ఫీజుగా లభించాయి.
అమితాబ్ బచ్చన్ ఈ సినిమాకు 1 లక్ష రూపాయలు తీసుకున్నారు.
'షోలే' సినిమాలో విలన్ పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నారు అమజద్ ఖాన్. అతను డాకూ గబ్బర్ సింగ్ పాత్ర పోషించాడు. ఈ పాత్ర కోసం అమజద్ ఖాన్ కు 50 వేల రూపాయలు ఇచ్చారు.
బసంతి పాత్రలో హేమా మాలిని పోషించారు. 'షోలే' సినిమాలో ఆమె నటనకు చాలా ప్రశంసలు వచ్చాయి. బసంతి పాత్ర కోసం ఆమె 75 వేల రూపాయలు అందుకున్నారు.
'షోలే' సినిమాలోని ప్రధాన తారాగణంతో అత్యల్ప వేతనం తీసుకున్న నటీనటులలో జయా బచ్చన్ ఒకరు. షోలే సినిమాలో రాధా పాత్ర పోషించారు. దీని కోసం ఆమె 35 వేల రూపాయలు అందుకున్నారు.