Shivam Bhaje: రం రం ఈశ్వరం... భజే 'శివం భజే' - అశ్విన్ బాబు సినిమాలో ఫస్ట్ సాంగ్ రిలీజుకు ముహూర్తం ఖరారు
యువ కథానాయకుడు అశ్విన్ బాబు నటిస్తున్న న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వంలో గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాత. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు... సినిమా మీద అంచనాలు పెంచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి చిత్ర బృందం సిద్ధమైంది.
శివం భజే... ఈ టైటిల్‌లో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, స్టిల్స్ చూస్తే పరమ శివుని ప్రస్తావన కనిపిస్తుంది. సినిమాలో తొలి పాటను సైతం ఆ శివుని మీద రూపొందించారు. 'రం రం ఈశ్వరం...' అంటూ సాగే ఆ గీతాన్ని ఈ నెల 18 (గురువారం) ఉదయం 11.36 గంటలకు విడుదల చేయనున్నట్లు అశ్విన్ బాబు చెప్పారు. ఈ చిత్రానికి వికాస్ బడిస సంగీతం అందించారు.
Shivam Bhaje Release Date: 'రం రం ఈశ్వరం...' పాట విడుదలతో సినిమా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. ఆగస్టు 1న ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
Shivam Bhaje Movie Cast And Crew: అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, ఇంకా మురళీ శర్మ, తనికెళ్ళ భరణి, సాయి ధీనా, అయ్యప్ప శర్మ, 'హైపర్' ఆది, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
వైవిధ్యమైన కథతో, ఉన్నత సాంకేతిక విలువలతో 'శివం భజే' రూపొందుతోందని నిర్మాత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆల్రెడీ విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఇతర ప్రచార చిత్రాలకు వచ్చిన అద్భుతమైన స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు.
అన్ని వర్గాలను అలరించే సినిమా 'శివం భజే' అని దర్శకుడు అప్సర్, హీరో అశ్విన్ బాబు తెలిపారు. ఈ చిత్రానికి కూర్పు: ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర.