Rashmika No Makeup Look: రష్మికకు మేకప్ వేయకపోతే ఇంతే - ముంబైలో కెమెరాలకు దొరికేసిందిగా
హీరోయిన్లు అన్నాక అందంగా కనిపించాలి. అందుకోసం వాళ్ళు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇష్టం వచ్చిన ఫుడ్ తినడానికి ఉండదు, డైట్ చేయాలి కనుక. ఒక్కోసారి గ్లామర్ డ్రస్సులు, మేకప్ కూడా వేసుకోవాలి. అయితే, మేకప్ లేకుండా హీరోయిన్లు ఎలా వుంటారు? రష్మిక ఎలా వుంటుంది? అంటే లేటెస్ట్ ఫోటోలు చూడాలి.
రష్మిక రీసెంట్ గా ముంబైలోని ఒక లోకల్ ఫిషింగ్ మార్కెట్, హార్బర్ లాంటి ఏరియాకు వెళ్ళింది. అక్కడ జెట్టిని విజిట్ చేసింది. జెట్టి అంటే సముద్రంలోకి వెళ్ళడానికి కట్టే కరకట్ట లాంటిది. మేకప్ లేకుండా ముంబైలో జెట్టి దగ్గర ఫోటోలకు ఫోజులు ఇచ్చింది రష్మిక.
చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్టు ముద్దుగుమ్మ ఎలాగున్నా అందంగా వుంటుందని రష్మిక నో మేకప్ లుక్ చూస్తే చెప్పాలని అనిపించడం లేదూ? కేవలం నవ్వుతో నేషనల్ ఆడియన్స్ మనసు దోచుకుంటోంది రష్మిక.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన 'పుష్ప 2'లో యాక్ట్ చేస్తున్న రష్మిక చేతిలో మరో నాలుగైదు సినిమాలు వున్నాయి. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేయనున్న సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్. ఇంకా 'గర్ల్ ఫ్రెండ్', 'రెయిన్ బో' సినిమాలు చేస్తోంది.
నో మేకప్ లుక్ లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న