Pragya Jaiswal: చీర కట్టులో ప్రగ్యా జైస్వాల్ - ట్రెడిషనల్ లుక్‌తోనే మనసు దోచేశారుగా..
ఇటీవల స్విమ్ సూట్, వైట్ మోనోకినీలో గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. తాజాగా చీర కట్టులో ట్రెడిషనల్ లుక్‌తో అదరగొట్టారు.
క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్ మనసు దోచేలా ట్రెడిషనల్ శారీతో అదరగొట్టారు ప్రగ్యా. 'వీకెండ్ మ్యాజిక్' అంటూ ఈ ఫోటోస్ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
వీటిని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 'కంచె' మూవీతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫోటోస్, బెస్ట్ మూమెంట్స్ షేర్ చేస్తుంటారు.
తన అందం, అభినయం, యాక్టింగ్‌తో ప్రగ్యా జైస్వాల్ తెలుగు ఆడియన్స్ మనసు దోచేశారు. రీసెంట్‌గా బాలయ్య 'డాకు మహారాజ్' మూవీలో నటించారు. ప్రస్తుతం ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అందించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో 'కంచె' మూవీకి ప్రగ్యా పురస్కారం అందుకున్నారు. డైరెక్టర్ క్రిష్‌తో కలిసి ఆమె అవార్డు తీసుకున్నారు.