O Cheliya Songs: మంచు మనోజ్ విడుదల చేసిన 'ఓ చెలియా' పాట... నువ్వే చెప్పు చిరుగాలి!
S Niharika | 06 Sep 2025 02:49 PM (IST)
1
నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఓ చెలియా'. దీనికి ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి దర్శకులు. ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ పతాకాలపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని మొదటి పాటను రాకింగ్ స్టార్ మంచు మనోజ్ విడుదల చేశారు.
2
'నువ్వే చెప్పు చిరుగాలి...' అంటూ సాగే 'ఓ చెలియా' సినిమాలో పాటను మంచు మనోజ్ విడుదల చేశారు. ఆ పాటను సాయి చరణ్ పాడగా... ఎంఎం కుమార్ సంగీతం అందించారు. సుధీర్ బగడి రాశారు.
3
'నువ్వే చెప్పు చిరుగాలి...' సాంగ్ చూస్తే అలిగిన ప్రేయసిని కూల్ చేయడానికి హీరో ట్రై చేస్తునట్టు అర్థం అవుతోంది. హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ బావుంది.
4
'ఓ చెలియా' సినిమాకు సురేష్ బాలా సినిమాటోగ్రాఫర్. ఉపేంద్ర ఎడిటర్. త్వరలో విడుదల తేదీ వెల్లడించనున్నారు.