Nayanthara: పిల్లలతో కలిసి హాంకాంగ్ వీధుల్లో నయనతార అల్లరి - భర్తకు ముద్దులు, కవలలతో షికార్లు..
Nayanthara Latest Photos: సోషల్ మీడియాలో లేడీ సూపర్ స్టార్ నయనతార సందడి మామూలుగా లేదు. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న నయన్ వరుసగా ఫోటోలు షేర్ చేస్తుంది.
ఒకప్పుడు అసలు సోషల్ మీడియానే పట్టించుకోని ఆమె ఇప్పుడు మాత్రం వరుసగా పోస్ట్స్ చేస్తు తెగ సందడి చేస్తుంది.
కాగా నయతార ప్రస్తుతం తన భర్త విఘ్నేష్ శివన్, తన కవల పిల్లలు, భర్త విఘ్నేష్‌తో కలిసి పాపులర్ సిటీ హాంకాంగ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నయన్ ఎప్పుటికప్పుడు తన టూర్ పిక్స్ షేర్ చేస్తుంది. ఇటీవల భర్తకు ముద్దు పెడుతూ ప్రేమను కురిపించింది. పిల్లలతో కలిసి హాంకాంగ్ వీధుల్లో షికారు చేసింది.
ఇప్పుడు తాజాగా తన కవలల పిల్లలతో కలిసి నయన్ అల్లరి హాంకాంగ్ వీధుల్లో అల్లరి చేసింది. భర్తకు అప్యాయంగా ముద్దు పెడుతూ.. పిల్లలతో కలిసి రోడ్డుపై సందడి చేస్తూ ఇలా హాంకాంగ్ టూర్ బాగా ఎంజాయ్ చేస్తుంది.
తాజాగా ఈ ఫోటోలు షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీలను జతచేసింది. ప్రస్తుతం నయనతార ఫోటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. ఇక తన పిల్లలతో కలిసి నయన్ చేసిన అల్లరి చూసి ఆమె ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
లైక్ చిల్ట్రన్ లైక్ మదర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నయనతార చివరిగా షారుక్ ఖాన్ జవాన్ మూవీలో కనిపించింది.
ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ లేడీ సూపర్ స్టార్ తొలి చిత్రంతోనే హిందీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. ఆమె గ్లామర్ లుక్‌కి, యాక్టింగ్స్ స్కిల్స్‌తో నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు.
ఇక ప్రస్తుతం నయన్ చేతిలో దాదాపు అరడజన్ వరకు సినిమాలు ఉన్నాయి. అందులో టెస్ట్ మూవీ రీసెంట్‌గ్ షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. దీనితో పాటు Mannangatti Since 1960, తనీ ఒరువన్ 2, డియర్ స్టూడెంట్స్ వంటి సినిమాలు క్యూలో ఉన్నాయి.