Sitara Ghattamaneni: అప్పుడే 12 ఏళ్లు.. సితార బర్త్‌డే ఫోటో - వైట్ డ్రెస్‌లో ఎంజెల్‌లా మెరిసిపోతున్న సితూ పాప
Sitara Birthday Photo: సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరొద్కర్‌ల ముద్దుల తనయ సితార ఘట్టమనేని నేటితో 12వ వసంతంలోకి అడుగుపెడుతుంది. ఇవాళ (జూలై 20) సితార పుట్టినరోజు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ సందర్భంగా సితార సినీ సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అలాగే మహేష్, నమ్రతలు కూడా కూతురు సితారకు స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు.
ఇక నమ్రత సితారకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు, వీడియోలతో వీడియో ఎడిట్ చేసి కూతురిపై ప్రేమ కురిపించింది. ఇక తాజాగా నమ్రత మరో పోస్ట్ షేర్ చేశారు. తన 12వ బర్త్‌డే సందర్భంగా సితరాకు స్పెషల్ కేక్‌తో సర్‌ప్రైజ్ చేశారు.
ఆ కేక్ చూసి సితూ పాప స్టన్ అవుతూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. మొత్తం బట్టర్ ఫ్లై ఇమేజ్‌తో డిజైన్ చేసిన ఈ కేక్ చాలా స్పెషల్‌గా ఆకట్టుకుంటుంది. బర్త్‌డే గర్ల్ సితార వైట్ డ్రెస్‌లో ఎంజెల్‌లా మెరిసిపోయింది.
సితార బర్త్‌డే ఫోటో, కేక్ ఫోటో షేర్ చేస్తూ.. Happy birthday my beautiful baby may you soar high in the sky, and become all that you dream of becoming.. You’re beautiful inside out and always continue to be you అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం సితార బర్త్‌డే ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌కి మెగా కోడలు ఉపాసన స్పందిస్తూ.. హ్యాపీ బర్త్‌డే బ్యూటీఫుల్ అంటూ కామెంట్ చేసింది.