Mega Family Sankranti Celebrations: చిరంజీవి, నాగబాబు సెల్ఫీ - అందరి చూపు వెనుక ఉన్న ఆ ఇద్దరు పిల్లలపైనే!
సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఒకే చోటుకు చేరుకున్నారు. మెగా, అల్లువారి కుటుంబ సభ్యులంతా కలిసి బెంగుళూరు ఫాం హౌజ్‌లో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. మకర సంక్రాంతికి క్రిమ్ అండ్ రెడ్ అవుట్ ఫిట్‌లో మెగా ఫ్యామిలీ అంతా మెరిసిపోయింది. అబ్బాయిలు క్రిమ్ కలర్ షెర్వానీ, ఆడవాళ్లు రెడ్ డ్రెసుల్లో కనువిందు చేశారు. - Image Credit: Nagababu/Instagram
ఆ ఫొటోలు చూసి మెగా అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, పవర్ కళ్యాణ్ మాత్రం.. మిస్ అయ్యారు. ఆయనకు బదులు కుమారు అకీరా, కూతురు ఆద్య మెగా కుటుంబంతో కలిసి సందడి చేశారు. - Image Credit: Nagababu/Instagram
తాజాగా చిరంజీవి సోదరుడు నాగబాబు పోస్ట్ చేసిన ఫొటోలు సైతం అకీరా, ఆద్యలు కనిపించారు. దీంతో అంతా వారిద్దరి గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ఫొటో కామెంట్స్‌లలో అకీరా, ఆద్యాలు వెనుకే ఉన్నారు చూడండి అంటున్నారు. - Image Credit: Nagababu/Instagram
పవన్ కళ్యాణ్ వారితో కలిసి లేకపోయినా.. అకీరా, ఆద్యాలు ఆ లోటు తీర్చారని.. మెగా, అల్లు ఫ్యామిలీ వారిని కూడా తమతో కలుపుకుని సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నందుకు ఫుల్ ఖుష్ అవుతున్నారు. - Image Credit: Nagababu/Instagram
సంక్రాంతికి ఒకే ఫ్రేంలో మెగా-అల్లు ఫ్యామిలీని చూసి అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఇందులో అకిరా,ఆద్యాలు కూడా చేరడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ సెలబ్రేషన్ డబుల్ అయ్యింది. పవన్ కూడా ఉండి ఉంటుంది మెగా పూర్తయ్యేంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. - Image Credit: Nagababu/Instagram
ఈ పిక్స్ చూసి పవన్ కళ్యాణ్ మాజీ భార్య.. అకీరా, ఆద్యాల తల్లి రేణు దేశాయ్ కూడా చాలా సంతోషించింది. ఆ ఇద్దరి ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేసింది. - Image Credit: Nagababu/Instagram