Malavika Mohanan: నైబర్‌తో పోట్లాటకు దిగిన మాళవిక మోహనన్ - తన మర్షల్ ఆర్ట్స్ రుచి చూపించిందా?
Malavika Mohanan Photos: హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి ప్రత్యేకం చెప్పనవసరం లేదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన మాళవిక 'దళపతి' విజయ్ మాస్టర్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
ఈ సినిమాలో ఆమె అందం, అభినయానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది మాళవిక. ఇక సినిమా తర్వాత ఆమె తెలుగులో మరో మూవీ చేయలేదు.
ప్రస్తుతం సౌత్‌లో పలు సినిమాలతో బిజీగా ఉన్న మాళవిక కోలీవుడ్‌లో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తోంది. పా రంజిత్ దర్శకత్వంతో విక్రమ్ హీరో తెరకెక్కుతున్న ‘తంగలాన్’ సినిమాలో మళవిక కీ రోల్ పోషిస్తుంది.
ఇందులో ఆమె మార్షల్ ఆర్ట్ తెలిసి మహిళ పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ మళవిక ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంది. అయితే ఇప్పుడు దాన్ని తన పక్కింటి అమ్మాయిపై ప్రదర్శించింది.
సరదాగా అలా తన నైబర్‌తో కలిసి కర్రసాము చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ 'Your friendly neighbourhood not-so-delicate-girls' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.