NTR At Kantara Chapter 1 Event: 'కాంతార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ - క్యాండిడ్ ఫోటోలపై లుక్కేయండి
పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా తెరకెక్కిన సినిమా 'కాంతార చాప్టర్ 1'. రిషబ్ శెట్టి మరోసారి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దానికి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: mythrireleases / Instagram)
చిన్నతనంలో తాను విన్న అమ్మమ్మ కథలను రిషబ్ శెట్టి తెరపైకి తీసుకు వచ్చారని ఎన్టీఆర్ తెలిపారు. ఆయనకు ఆంజనేయస్వామి విగ్రహం ఇచ్చారు రిషబ్ శెట్టి. (Image Courtesy: mythrireleases / Instagram)
'కాంతార 2'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'డ్రాగన్'లోనూ ఆవిడ హీరోయిన్. (Image Courtesy: mythrireleases / Instagram)
రిషబ్ శెట్టి కోసం తాను 'కాంతార' ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చానని ఎన్టీఆర్ అంటే... ఎన్టీఆర్ తనకు సోదరుడు అని రిషబ్ శెట్టి చెప్పారు. (Image Courtesy: mythrireleases / Instagram)
ఎన్టీఆర్ తనకు అన్నయ్యతో సమానం అని రిషబ్ శెట్టి భార్య ప్రగతి తెలిపారు. ఈ సినిమా తెలుగులోనూ విజయం సాధించాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. (Image Courtesy: mythrireleases / Instagram)
'కాంతార చాప్టర్ 1' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు (Image Courtesy: mythrireleases / Instagram)