Tarakasura Movie Telugu : తెలుగులోకి కన్నడ 'తారకాసుర' - తృప్తి శుక్లా రెండో నాయికగా!
కన్నడలో సంచలన విజయం సాధించిన 'తారకాసుర' చిత్రాన్ని అదే పేరుతో శ్రీజా మూవీస్ పతాకంపై విజయ్ భాస్కర్ రెడ్డి పాళ్యం తెలుగులో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. రవికిరణ్, మాన్విత హరీష్ జంటగా నటించిన ఈ చిత్రంలో చక్రవర్తి, తృప్తి శుక్లా సెకండ్ హీరో హీరోయిన్లుగా కనిపించన్నారు.
'తారకాసుర' చిత్రంలో హాలీవుడ్ నటుడు డేని సపని ముఖ్య పాత్రలో, శాంసన్ యోహాన్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ చిత్రానికి చంద్రశేఖర్ బండియప్ప దర్సకత్వం వహించారు.
శ్రీజా మూవీస్ అధినేత విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులకు నచ్చేట్లుగా 'తారకాసుర' చిత్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. మేం కొంత షూటింగ్ కూడా చేస్తున్నాం. మా సంస్థ నుంచి త్వరలో ఒక స్ట్రయిట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నం'' అని అన్నారు.
'తారకాసుర' సినిమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తృప్తి శుక్లా
'తారకాసుర' సినిమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మానస్ నాగులపల్లి పద్మిని, చిత్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన ధీరజ అప్పాజీ
'తారకాసుర' సినిమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ
'తారకాసుర' సినిమా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న 'లయన్' సాయి వెంకట్
'తారకాసుర' విలేకరుల సమావేశంలో అతిథులతో చిత్ర బృందం