Mrunal Thakur: ఎవర్రా మృణాల్ చీరల్లో మాత్రమే అందంగా ఉంటుందని చెప్పింది - ఈ ఫోటోలు చూశారా?
S Niharika | 28 Sep 2024 10:08 AM (IST)
1
IIFA 2024: 'సీతా రామం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా ముద్ర వేసుకుంది మృణాల్ ఠాకూర్. తర్వాత నటించిన 'ఫ్యామిలీ స్టార్', 'హాయ్ నాన్న' కూడా హిట్టు సినిమాలే. ఆవిడను పక్కింటి అమ్మాయిలా, సంప్రదాయానికి చిరునామాలా చూసే జనాలు ఎక్కువ మంది.
2
తెలుగులో మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైనవి చూస్తే... మృణాల్ ఠాకూర్ చీరల్లో సూపర్ ఉంటారని అర్థం అవుతుంది. అయితే... ఆవిడ చీరల్లో మాత్రమే కాదు, మోడ్రన్ డ్రస్సుల్లోనూ సూపర్ ఉంటారని ఈ ఫోటోలు చూస్తే తెలుస్తుంది.
3
దుబాయ్‌లో జరుగుతున్న ఐఫా అవార్డుల్లో మృణాల్ ఠాకూర్ ఈ డ్రస్ లో సందడి చేశారు. మృణాల్ మోడ్రన్ లుక్ కూడా బావుంది కదూ!
4
సాధారణంగా అవార్డుల్లో రెడ్ కార్పెట్ ఉంటుంది కదూ! కానీ, ఐఫా కొత్తగా ఆలోచించి గ్రీన్ కార్పెట్ ఏర్పాటు చేసింది.