Ashwadhama First Look : వరలక్ష్మితో హృతిక్ శౌర్య - హీరో బర్త్ డేకి 'అశ్వద్ధామ' ఫస్ట్ లుక్
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా 'అశ్వద్ధామ'. 'హతః అక్షర’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో హృతిక్ శౌర్య హీరో. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. (Image Courtesy : Ashwadhama Movie)
హృతిక్ శౌర్య, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో రూపొందుతోన్న 'అశ్వద్ధామ' సినిమాకు చంద్ర శేఖర్ ఆజాద్ పాటిబండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్లిక్ నైన్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. (Image Courtesy : Ashwadhama Movie)
ఇటీవల థియేటర్లలో విడుదలైన 'ఓటు' సినిమాతో హృతిక్ శౌర్య హీరోగా కెరీర్ ప్రారంభించారు. అందులో సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన ఆయన... ఈ సినిమాలో పక్కా కమర్షియల్ హీరో క్యారెక్టర్ చేస్తున్నారని చిత్ర బృందం తెలిపింది. (Image Courtesy : Ashwadhama Movie)
'అశ్వద్ధామ' దర్శకుడు చంద్ర శేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ ''గ్రామీణ నేపథ్యంలో సాగే లవ్, క్రైమ్ థ్రిల్లర్ ఇది. కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా ఉంటుంది. ఆమె పోలీస్ రోల్ చేస్తున్నారు. హృతిక్ శౌర్య ఈ సినిమాతో కమర్షియల్ హీరోగా ఎలివేట్ అవుతాడు. ఆయన చేసిన యాక్షన ఎపిసోడ్స్‌కి టీమ్ అంతా ఫిదా అయింది. విలన్ ఛాయలు ఉన్న పాత్రలో నటించే ఆర్టిస్ట్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ అవుతారు'' అని చెప్పారు. (Image Courtesy : Ashwadhama Movie)
హృతిక్ శౌర్య, వరలక్ష్మీ శరత్ కుమార్, 'చిత్రం' శ్రీను, 'టెంపర్' వంశీ, మానిక్ రెడ్డి,సత్యకృష్ణ, 'షేకింగ్' శేషు, యోగి కత్రి, 'పటాస్' ప్రవీణ్ తదితరులు 'అశ్వద్ధామ' సినిమాలో ప్రధాన తారాగణం. (Image Courtesy : Ashwadhama Movie)
'అశ్వద్ధామ' చిత్రానికి ఛాయాగ్రహణం : శ్యామ్ కె నాయుడు, కళా దర్శకత్వం : చిన్నా, సంగీతం : ప్రజ్వల్ కుమార్, సాహిత్యం: తేజ, స్టంట్స్ : పృధ్వీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రామకృష్ణ ఉప్పలపాటి, నిర్మాణం: ఫ్లిక్ నైన్ ఫిల్మ్స్, కథ - మాటలు - దర్శకత్వం : చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల (Image Courtesy : Ashwadhama Movie)