Honey Rose: బ్లాక్ చీరలో హనీ రోజ్ స్టన్నింగ్ లుక్ - ఆమెను ఇలా చూస్తే మతిపోవాల్సిందే
Honey Rose Latest Photos: చాలా గ్యాప్ తర్వాత హనీ రోజ్ సోషల్ మీడియాలో సందడి చేసింది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలు షేర్ చేసింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబ్లాక్ శారీలో హనీ రోజ్ తళుక్కున మెరిసింది. చెవిలో ఎల్లో కలర్ గులాబీ, ఉల్లిపోరలాంటి బ్లాక్ చీరలో అందాల విందు చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి
కాగా హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒక్క సినిమాతో ఆమె రాత్రికిరాత్రే స్టార్‌డమ్ అందుకుంది.
చేసింది మదర్ రోలే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీతో తెలుగు ఆడియన్స్‌కు చేరువైంది ఈ ముద్దుగుమ్మ.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది.
దీంతో ఆమెకు నెట్టింట విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. రీలీజ్ తర్వాత సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆమె వీడియోలే. ఈ దెబ్బతో ఆమె టాలీవుడ్‌లో ఫుల్ బిజీ అయిపోతుందని అనుకున్నారంతా.
కానీ అలా జరగలేదు. సోషల్ మీడియా, షాపింగ్స్ మాల్స్ ఒపెనింగ్స్ తప్పితే ఈ బ్యూటీ స్క్రీన్‌పై కనిపించింది లేదు. ఆమె జోరు, సందడి అంతా సోషల్ మీడియాకే పరిమితమైంది.
ఈ క్రమంలో హనీ రోజ్ తరచూ తన ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట యమ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా సిల్కి చీరలో ఈ బ్యూటీ కనువిందు చేసింది. స్టీవ్‌లెస్ బ్లౌజ్, ఉల్లిపోర లాంటి పలుచటి సిల్క్ చీరలో అందాలు ఒలకబోసింది.