Aaradhya Devi: ఇమాన్వీ లాగే రీల్స్‌తో మూవీ చాన్స్ - బాడీ షేమింగ్‌తో ట్రోల్స్, ఆర్జీవీ హీరోయిన్ గురించి ఈ విషయాలు తెలుసా?
About Saaree Heroine Aradhya Devi: సోషల్ మీడియాలో వల్ల ఎంతోమంది తమ టాలెంట్‌ని ప్రూవ్ చేసుకుంటున్నారు. రీల్స్ ద్వారా తమలో నటనను బయటకు తెస్తున్నారు. మరికొందరు డ్యాన్స్‌తో అదరగొడుతున్నారు.
ఇలా సామాజిక మాధ్యమాల ద్వారా తమ టాలెంట్‌తో సినిమా ఆఫర్స్ కొట్టేసిన వారు ఎంతోమంది. ఇక ఇటీవల తన డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది సోషల్ మీడియా స్టార్ ఇమాన్వీ.
ఇమాన్వీ కంటే ముందే ఒక అమ్మాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు శ్రీలక్ష్మీ సతీష్. ఈ పేరు చెబితే ఆమెను ఎవరూ గుర్తు పట్టకపోవచ్చు. అదే రామ్ గోపాల్ వర్మ ఆరాధ్య దేవి అంటే మాత్రం వెంటనే గుర్తుట్టేస్తారు.
తరచూ చీరలో రీల్స్ చేస్తూ డైరెక్టర్ ఆర్జీవీ దృష్టిలో పడింది ఆమె. రకరకాల స్టైల్లో చీరకట్టి రీల్స్ చేస్తూ అందాలో ఒలకబోస్తూ రీల్స్ చేసి శ్రీలక్ష్మి.. ఆ తర్వాత ఆర్జీవీ కంటపడింది. ఇక ఆమె అందానికి ఫిదా ఆయన ఆమె హీరోయిన్‌గా ఏకంగా సినిమా తీస్తున్నారు.
టైటిల్ కూడా ఆమె తగ్గట్టుగానే 'చీర' అని పెట్టేశాడు. ఈ సినిమా సంబంధించిన పోస్టర్స్, లుక్స్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే మొదట్లో వీడియోస్ వల్ల విపరీతమైన ట్రోల్స్, బాడీ షేమింగ్ ఎదుర్కొన్న శ్రీలక్ష్మి.. శారీ మూవీ ఫస్ట్‌లుక్‌తో అమాంతం ఫాలోవర్స్‌ని పెంచుకుంది.
ప్రస్తుతం శారీ సినిమాతో బిజీగా ఈ సోషల్ మీడియా సెన్సేషన్.. అప్పుడప్పుడ నెట్టింట ఫాలోవర్స్ ముచ్చటిస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె వయసు గురించి ప్రశ్నించగా 22 అని చెప్పింది.
ఆమె హైట్ 5 ఫీట్స్ 8 ఇంచెస్ అట. అయితే తన గ్లామర్, ఆకట్టుకునే శరీరాకృతితో ఆర్జీవీని ఆకట్టుకున్న ఈ భామ ఒక సమయంలో తన లుక్ పరంగా ట్రోల్స్ ఎదుర్కొందట. ఒకప్పుడు లావుగా నల్లగా ఉండేదట.
దీంతో తన శరీరాకృతి, కలర్‌పై ట్రోల్స్ ఎదుర్కొన్న ఆమె కష్టపడి వర్క్ అవుట్ చేసి ఇలా అందంగా, నాజుగ్గా మారి ఆర్జీవీ 'ఆరాధ్య దేవి'గా మారింది.