Telugu Movies: తికమక తాండ, కోబలి తర్వాత కొత్త సినిమా... కుటుంబ నేపథ్యంలో పల్లెటూరి ప్రేమకథ
'తికమక తాండ', 'కోబలి' తర్వాత టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 3 సినిమా ప్రారంభమైంది. ప్రేమ, కుటుంబ అనుబంధాలు ఆవిష్కరించేలా పల్లెటూరి నేపథ్యంలో సినిమాను ప్రారంభించారు. తిరుపతి శ్రీనివాస రావు నిర్మాణంలో ఆదినారాయణ పినిశెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హరికృష్ణ భవ్య శ్రీ హీరో హీరోయిన్లు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిత్ర దర్శకుడు ఆదినారాయణ పినిశెట్టి మాట్లాడుతూ... ''ఫీల్ గుడ్ ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. అన్ని వర్గాలను మెప్పించేలా ఉంటుంది. ఓ వైవిధ్యమైన ప్రేమ కథను ప్రేక్షకులు చూస్తారు'' అని అన్నారు.
చిత్ర నిర్మాత తిరుపతి శ్రీనివాస రావు మాట్లాడుతూ... ''పల్లెటూరి నేపథ్యంలో చక్కటి ప్రేమ కథగా రాబోతుందీ సినిమా. ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చాం. ఫస్ట్ షెడ్యూల్ స్టర్స్ చేశాం. కంటెంట్ నచ్చడంతో వెంటనే సినిమా మొదలు పెట్టాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటుందీ సినిమా'' అని అన్నారు.
టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్ 3గా రూపొందుతున్న ఈ సినిమాకు విపిన్ వి రాజ్ సినిమాటోగ్రఫీ, గౌతమ్ రవిరామ్ సంగీతం, విజయ్ కందుకూరి సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్.
హరికృష్ణ, భవ్య శ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ చిత్రానికి సంభాషణలు: విజయ్ కందుకూరి, సంగీతం: గౌతమ్ రవిరామ్, ఛాయాగ్రహణం: విపిన్ వి రాజ్, దర్శకత్వం: ఆదినారాయణ. పినిశెట్టి, నిర్మాత: తిరుపతి శ్రీనివాస రావు.