Dharmendra News: ధర్మేంద్రకు 2 పెళ్లిళ్లు- ఆరుగురు పిల్లలు- 13 మంది మనవళ్లు, మునిమనవళ్ల ఫ్యామిలీ ట్రీ ఇదే!
ధర్మేంద్ర బాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన నటులలో ఒకరు. ఆయన తన కెరీర్ లో ఎన్నో పెద్ద సినిమాల్లో నటించారు. ఆయన సినీ జీవితంతోపాటు వ్యక్తిగత జీవితం కూడా ఆసక్తిని కలిగిస్తుంది. బాలీవుడ్‌లో విజయవంతమైన కెరీర్‌ను నిర్మించుకున్న తరువాత, నటుడు తన పెద్ద కుటుంబంతో సంతోషకరమైన జీవితం గడుపారు.
సీనియర్ నటుడు ధర్మేంద్ర రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. 19 సంవత్సరాల వయసులో 1954లో ఆయన ప్రకాష్ కౌర్‌తో ఏడు అడుగులు వేశారు. కానీ అప్పుడు ధర్మేంద్ర సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టలేదు. పెళ్లి తర్వాత ప్రకాష్ కౌర్, ధర్మేంద్ర ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు అంటే నలుగురు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.
ఈ నలుగురు పిల్లలకు సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్, అజీతా డియోల్ అని పేర్లు పెట్టారు. సన్నీ, బాబీ డియోల్ సినిమా పరిశ్రమలో సుపరిచితులు, కానీ వారిద్దరు సోదరీమణులు సెలబ్రిటీ లైఫ్‌కు చాలా దూరంగా ఉంటారు. ధర్మేంద్ర మొదటి భార్య పిల్లలు వారి జీవితాల్లో స్థిరపడ్డారు.
ప్రకాష్ కౌర్ నుంచి విడాకులు తీసుకోకుండానే బాలీవుడ్ హీమన్ 1980లో హేమా మాలినిని వివాహం చేసుకున్నారు. 13 సంవత్సరాలు కంటే తక్కువ వయసు ఉన్న నటితో ఏడు అడుగులు వేసిన తరువాత, ఈ జంట ఇద్దరు కుమార్తెలకు తల్లిదండ్రులు అయ్యారు. ధర్మేంద్ర, హేమా తమ కుమార్తెలకు ఈషా, అహానా డియోల్ అని పేర్లు పెట్టారు.
ధర్మేంద్ర రెండు పెళ్లిళ్ల ద్వారా కలిగిన పిల్లలందరూ ఇల్లు నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆ నటుడు మొత్తం 13 మంది మనవళ్లు, మనవరాళ్లకు తాతయ్య అయ్యారు. నటుడి పెద్ద కుమారుడు సన్నీ డియోల్ భార్య పూజ లైమ్ లైట్ నుంచి దూరంగా ఉంటారు. ఈ జంటకు ఇద్దరు కుమారులు కరణ్, రాజ్ వీర్ ఉన్నారు,
ధర్మేంద్ర రెండో కొడుకు బాబీ డియోల్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలు తాన్యా అహూజాతో ఏడు అడుగులు వేశారు, వారికి ఆర్యమాన్, ధరం అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
బాబీ డియోల్ సోదరీమణులు విజేత, అజీతా లైమ్‌లైట్ నుంచి దూరంగా ఉంటారు. తరచుగా మొత్తం కుటుంబాన్ని కుటుంబ కార్యక్రమాలలో కలిసి చూస్తారు. ఇద్దరు సోదరీమణులు వివాహం తర్వాత విదేశాలకు వెళ్లారు. వారు లైమ్‌లైట్ నుంచ దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో ఇద్దరూ చాలా చురుకుగా ఉన్నారు. విజేత, అజీతా ఇద్దరూ ఇద్దరు పిల్లలకు తల్లులు.
అదేవిధంగా ధర్మేంద్ర, హేమా మాలిని కుమార్తెలు ఈషా, అహానా గురించి మాట్లాడితే, వారిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు. ఈషా డియోల్ తన తల్లిదండ్రుల వలె సినిమాల్లో నటించడానికి ప్రయత్నించింది, కాని ఆమె విఫలమైంది. నటి 2012లో వ్యాపారవేత్త భరత్ తఖ్తానితో ఏడు అడుగులు వేసింది, కాని ఇప్పుడు ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. తన వివాహంలో ఈషా డియోల్ రాధ్యా, మిరాయా అనే ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది.
ధర్మేంద్ర, హేమా మాలినిల చిన్న కుమార్తె పేరు అహానా డియోల్. ఆమె వ్యాపారవేత్త వైభవ్ వోహ్రాతో ఏడు అడుగులు వేసింది. తరువాత, 2015లో ఆమె కుమారుడు డేరియన్ వోహ్రాకు తల్లి అయ్యింది. 2020లో ఆమె ఇద్దరు కవల కుమార్తెలకు జన్మనిచ్చింది.