Chiyaan Vikram: విజయవాడ బాబాయ్ హోటల్‌లో కోలీవుడ్ స్టార్ విక్రమ్ - 'తంగలాన్' హీరోయిన్ మాళవిక కూడా!
Chiyaan Vikram and Malavika Mohanan in Vijayawada: కోలీవుడ్ స్టార్ హీరో 'చియాన్' విక్రమ్, మలయాళీ ముద్దుగుమ్మ మాళవికా మోహనన్ సోమవారం (ఆగస్టు 12న) విజయవాడలో సందడి చేశారు. వాళ్లిద్దరూ నటించిన సినిమా 'తంగలాన్' ప్రమోషన్ కోసం ఏపీకి వెళ్లారు.
విజయవాడ వెళ్లిన విక్రమ్, మాళవికా మోహనన్, 'తంగలాన్' టీమ్... ఆ సిటీలోని ఫేమస్ బాబాయ్ హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఇడ్లీ, స్పెచల్ చట్నీ, సాంబార్ లాగించారు. ప్రజెంట్ ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'తంగలాన్' సినిమాను దర్శకుడు పా రంజిత్ తెరకెక్కించారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్ (గోల్డ్ మైన్స్) నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. స్టూడియో గ్రీన్ పతాకంపై కెఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ విడుదలైన 'తంగలాన్' పాటలు, ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది.
విజయవాడలోని బాబాయ్ హోటల్ ముందు నెలకొన్న సందడి. విక్రమ్, మాళవిక రావడంతో వాళ్ళిద్దర్నీ చూడటానికి ప్రేక్షకులు ఎగబడ్డారు.