Bigg Boss Sohel's Lucky Lakshman Update : 'బిగ్ బాస్' సోహైల్ కొత్త సినిమా 'లక్కీ లక్ష్మణ్' కహానీ
'ఓ మేరీ జాన్... మనసే నువ్వే కావాలన్నదే' పాట విడుదల చేసే ముందు, లిరికల్ వీడియో చూస్తున్న చందూ మొండేటి.
చుట్టుపక్కల వారంతా నువ్వు లక్కీ ఫెలో అంటున్నా సరే... తాను ఎప్పటికీ అన్ లక్కీ ఫెలోనని అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో హరిత గోగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి ఎ.ఆర్ అభి దర్శకత్వం వహించారు.
'బిగ్ బాస్' ఫేమ్ సోహైల్ సరసన మోక్ష కథానాయికగా నటించిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి, త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'ఓ మేరీ జాన్ మనసే నువ్వే కావాలన్నదే...' పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా... అనురాగ్ కులకర్ణి ఆలపించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
'కార్తికేయ 2' చిత్ర దర్శకుడు చందూ మొండేటితో 'లక్కీ లక్ష్మణ్' హీరో సోహైల్, ఇతర యూనిట్ సభ్యులు
'కార్తికేయ 2' చిత్ర దర్శకుడు చందూ మొండేటితో 'లక్కీ లక్ష్మణ్' హీరో సోహైల్, ఇతర యూనిట్ సభ్యులు