Vishnu Vishal's AARYAN Launch : శ్రద్ధా శ్రీనాథ్, వాణీ భోజన్ నడుమ విష్ణు విశాల్ - క్రైమ్ థ్రిల్లర్ షురూ
'ఆర్యన్'ను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారని ఈ రోజు విడుదల చేసిన ఫస్ట్ లుక్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రానికి ప్రవీణ్ కె దర్శకత్వం వహిస్తున్నారు. ఫాస్ట్ ఫేస్డ్ స్క్రీన్ ప్లే, ఊహకు అందని మలుపులతో సన్నివేశాలు చాలా వేగంగా ముందుకు వెళతాయని చిత్ర బృందం పేర్కొంది.
'ఆర్యన్' సినిమాలో యువ తెలుగు హీరో సాయి రోనక్, తారక్ పొన్నప్ప, అభిషేక్ జోసెఫ్ జార్జ్, మల పార్వతి ఇతర తారాగణం. ఈ సినిమాను శుభ్రా, ఆర్యన్ సమర్పణలో విష్ణు విశాల్ నిర్మిస్తున్నారు.
'జెర్సీ'తో పాటు 'కృష్ణ అండ్ హిజ్ లీల'తో తెలుగులో శ్రద్ధా శ్రీనాథ్ విజయాలు అందుకున్నారు. (Image courtesy - @Shraddha Srinath/Instagram)
'మీకు మాత్రమే చెప్తా' సినిమాలో వాణీ భోజన్ నటించారు. పలు తమిళ చిత్రాల్లో నటించిన ఈవిడ, తెలుగులో నవీన్ చంద్రతో ఒక సినిమా చేస్తున్నారు.
విష్ణు విశాల్ తెలుగమ్మాయి, బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన లాస్ట్ సినిమా 'ఎఫ్.ఐ.ఆర్' తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.