Sitaram Sitralu Trailer: 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల చేసిన ఆకాష్ జగన్నాథ్ - సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
యువ కథానాయకుడు, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ చేతుల మీదుగా 'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. అలాగే, ఈ నెల 30వ తేదీన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్టు వెల్లడించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సీతారాం సిత్రాలు' సినిమాలో లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక తూటిక ప్రధాన పాత్రల్లో నటించారు. రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై పి. పార్థసారథి, డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు సంయుక్తంగా నిర్మించారు. డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వం వహించారు.
'సీతారాం సిత్రాలు' ట్రైలర్ విడుదల అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ... ''ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ మన తెలుగు ప్రేక్షకుల వైపు చూస్తోంది. మన వాళ్లకు సినిమా భుజాల మీద మోస్తారు. సినిమా బాగుంటే భారీ విజయాన్ని కట్టబెడతారు. ఈ 'సీతారాం సిత్రాలు'కు పెద్ద విజయాన్ని అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అని అన్నారు.
'సీతారాం సిత్రాలు' సినిమా నిర్మాతలు మాట్లాడుతూ... ''మా చిత్ర బృందం అంతా ఇది తమ సొంత సినిమాలా ఎంతో కష్టపడి పని చేశారు. సోషల్ మీడియా ద్వారా దర్శకుడు మారుతి గారు, రెండు పాటలను విడుదల చేసిన హీరో విశ్వక్ సేన్ - సందీప్ కిషన్ గారికి థాంక్స్. అలాగే, మాకు ఎంతో మద్దతు ఇస్తున్న హీరో కార్తికేయ గారికి కూడా థాంక్స్. ట్రైలర్ విడుదల చేసిన ఆకాష్ జగన్నాథ్ గారికి థాంక్స్. మాది చిన్న సినిమా అయినా అందరికీ నచ్చే సినిమా. పెద్ద విజయం ఇవ్వాలని కోరుతున్నా'' అని అన్నారు.
కథానాయిక భ్రమరాంబిక మాట్లాడుతూ... ''ట్రైలర్ విడుదల ఆకాష్ జగన్నాథ్ గారికి స్పెషల్ థాంక్స్. మేమంతా ఎంతో ఇష్టపడి కష్టపడి ఈ సినిమా చేశాం'' అని చెప్పారు. దర్శకుడు డి. నాగ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ... ''కరోనా కాలంలో స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చినవి సినిమాలే. ఆ సమయంలో నేనూ జంధ్యాల, ఈవివి, రేలంగి సినిమాలు చూశా. మా 'సీతారాం సిత్రాలు' కూడా అలా స్ట్రెస్ రిలీఫ్ ఇచ్చే సినిమా'' అని అన్నారు.