Aishwarya Rajesh: డ్రస్సింగ్ స్టైల్ మారింది, మోడ్రన్ లుక్కులోకి వచ్చింది... తెలుగమ్మాయ్ ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ ఫోటోలు
Actress Aishwarya Rajesh Latest Photos: తెలుగమ్మాయి, తమిళ సినిమాలతో విజయాలు అందుకోవడంతో పాటు చెన్నైలో సెటిలైన ఐశ్వర్యా రాజేష్ అంటే చాలా మంది ఆడియన్స్ లో ట్రెడిషనల్ గర్ల్ అని ఇమేజ్ ఉంది. సినిమాల్లోనూ ఆవిడ అటువంటి క్యారెక్టర్లు చేశారు. ప్రజెంట్ ఆవిడ స్టైలిష్ ఫోటోలు చూస్తుంటే ఆ ఇమేజ్ మార్చే ప్రక్రియలో ఉన్నట్టు ఉన్నారు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్యా రాజేష్ మోడ్రన్ గర్ల్ రోల్స్ చేయలేదు అని కాదు... చేశారు. సాయి తేజ్ 'రిపబ్లిక్' వంటి సినిమాల్లో ఆవిడ అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై అమ్మాయిగా కనిపించారు. కానీ, ఆ సినిమాలు ఏవీ ఆవిడకు ఆశించిన విజయాలు ఇవ్వలేదు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్య రాజేష్ ఇప్పుడు సీరియస్ గా ఇమేజ్ మేకోవర్ లో పడినట్టు ఉన్నారు. ఈ ఫోటోలను లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు రెస్పాన్స్ అదిరింది. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
'వుయ్ వాంట్ మోర్ గ్లామర్ ఫోటోస్ డస్కీ డియర్' అని ఒక నెటిజన్ ఐశ్వర్య రాజేష్ షేర్ చేసిన ఈ ఫోటోలకు కామెంట్ చేశారు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
ఐశ్వర్య రాజేష్ తెలుగులో ఒకప్పటి హీరో రాజేష్ కుమార్తె, సీనియర్ ఫిమేల్ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు. (Image Courtesy: aishwaryarajessh / Instagram)
తెలుగులో ఐశ్వర్య రాజేష్ కొన్ని సినిమాలు చేశారు. కానీ, ఆవిడకు తెలుగు కంటే తమిళం నుంచి ఎక్కువ ఆఫర్లు వస్తున్నాయి. (Image Courtesy: aishwaryarajessh / Instagram)