Vedhika: వేదిక... అలా అయితే చీర కట్టుకోవాల్సిన అవసరం లేదిక - ఆ సొగసు చూడతరమా
వేదికను చూస్తే కుర్రకారు చూపు తిప్పుకోవడం కాస్త కష్టమే. ఆవిడ అందం అటువంటిది. సొగసు చూడతరమా అన్నట్టు ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బరువు పెరిగింది లేదు. నాజూకైన శరీరాకృతితో అందరిని కట్టిపడేస్తుంది. అన్నట్టు... ఈ ఫోటోలతో మహిళలకు ఆవిడ ఓ సందేశం కూడా ఇచ్చారు. (Image Courtesy: vedhika4u / Instagram)
వేదికను చూస్తే ఏదో డ్రస్ ధరించినట్టు ఉంది కదూ! కానీ, అసలు నిజం అది కాదు. ఆవిడ వేసుకున్నది శారీ. వీటిని ప్రీ డ్రెపింగ్ శారీస్ అంటారు. అంటే... చీర కట్టుకోవడం రాదని ఆలోచించే మహిళల కోసం అన్నమాట. హ్యాపీగా డ్రస్ ధరించినట్టు ధరిస్తే చాలు. (Image Courtesy: vedhika4u / Instagram)
రాఘవా లారెన్స్ 'కాంచన' ఫ్రాంచైజీ సినిమాలతో వేదిక విజయాలు అందుకుంది. రీసెంట్ 'రజాకార్' సినిమాలో సీరియస్ రోల్ చేసింది. అంతకు ముందు కింగ్ అక్కినేని నాగార్జున 'బంగార్రాజు' సినిమాలో అతిథి పాత్రలో మెరిసింది. (Image Courtesy: vedhika4u / Instagram)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లేటెస్ట్ వెబ్ సిరీస్ 'యక్షిణి'లో వేదిక నటించింది. దానికి మంచి పేరు వచ్చింది. (Image Courtesy: vedhika4u / Instagram)
ప్రస్తుతం వేదిక చేతిలో అరడజను సినిమాలు ఉన్నాయి. కన్నడలో 'గణ', తెలుగులో 'ఫియర్', తమిళంలో పెట్ట ర్యాప్', 'వినోదం', మలయాళంలో 'చేతి మందారం తులసి', 'నాలాం తూను', తెలుగు - తమిళ సినిమా 'జంగిల్' సినిమాలు చేస్తున్నారు. (Image Courtesy: vedhika4u / Instagram)