Brahmaji: నా పెరుగన్నంలో ఆవకాయ్... నా జీవితంలో నవ్వు నవ్వేనోయ్... భార్యకు బ్రహ్మజీ పెళ్లి రోజు శుభాకాంక్షలు
నటుడు బ్రహ్మాజీలో మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఆయనలో ఒక ఫిలాసఫర్, ఒక భర్త కూడా ఉన్నారు. పెళ్లి రోజు సందర్భంగా భార్యకు సరదాగా వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పారు. (Image Courtesy: brahms25 / Instagram)
''నా పెరుగన్నంలో ఆవకాయ నువ్వే... నా పాలలో డేవిడ్ ఆఫ్ కాఫీ నువ్వే... నా వోడ్కాలో అల్లం నువ్వే... నా జీవితానికి నవ్వులు నువ్వే... నన్ను భరిస్తున్నందుకు థాంక్యూ. హ్యాపీ యానివర్సరీ'' అని సోషల్ మీడియాలో బ్రహ్మాజీ పోస్ట్ చేశారు. (Image Courtesy: brahms25 / Instagram)
ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ ముందు భార్య శస్వతీతో బ్రహ్మాజీ. ఆమెది బెంగాలీ అయితే ఈమెది ఆంధ్ర. వీళ్ళిద్దరిదీ ప్రేమ వివాహం. (Image Courtesy: brahms25 / Instagram)
పెళ్లి రోజు సందర్భంగా భార్యతో దిగిన ఫోటోలను బ్రహ్మాజీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాళ్ళిద్దరి మధ్య ఎంతటి ప్రేమ, అనుబంధం, ఆప్యాయత ఉన్నాయో ఈ ఫోటోలు చూస్తుంటే తెలుస్తోంది. (Image Courtesy: brahms25 / Instagram)
భార్యతో కలిసి బ్రహ్మాజీ అప్పుడప్పుడు టూర్లకు వెళతారు. ఆయా ప్రదేశాలలో దిగిన ఫోటోలను ఆయన షేర్ చేశారు. బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ హీరోగా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. (Image Courtesy: brahms25 / Instagram)
భార్యతో కలిసి విదేశాలు వెళ్ళినప్పుడు విమానంలో బ్రహ్మాజీ తీసుకున్న సెల్ఫీ. (Image Courtesy: brahms25 / Instagram)
బ్రహ్మాజీ, శాస్వతి దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు. (Image Courtesy: brahms25 / Instagram)