Chiranjeevi: పద్మ విభూషణ్ వచ్చాక చిరంజీవి అటెండ్ అయిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ - ఎక్కడో తెలుసా?
రిపబ్లిక్ డే మెగా ఫ్యామిలీకి మరింత మెమరబుల్ అని చెప్పాలి. అభిమానులకు అన్నయ్య, మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ రావడంతో మెగా కుటుంబ సభ్యులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మరి, దేశంలో రెండో అత్యున్నత పురస్కారం అందుకున్న తర్వాత చిరంజీవి అటెండ్ అయిన ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఏదో తెలుసా? అయితే... కింద ఫోటో చూడండి.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు మెగాస్టార్ స్వయంగా హాజరయ్యారు. జెండా వందనం చేశారు. ఆయనతో పాటు మెగా నిర్మాత అల్లు అరవింద్, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లు కూడా బ్లడ్ బ్యాంక్‌లో సందడి చేశారు.
చిరంజీవికి పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు రావడంలో బ్లడ్ బ్యాంక్ ప్రముఖ పాత్ర పోషించిందని చెప్పాలి. రాష్ట్రంలో సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని తెలిసిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపించారు. అలాగే, ఐ బ్యాంక్ కూడా! చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో చిరంజీవి రిపబ్లిక్ డే సెలెబ్రేట్ చేశారు. పద్మ విభూషణ్ వచ్చాక ఆయన అటెండ్ అయిన ఫస్ట్ ప్రోగ్రాం ఇది.
చిరంజీవి వస్తున్నారని తెలిసి అక్కడికి అభిమానులు చాలా మంది వచ్చారు. వాళ్ళతో 'మీ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది' అని చిరంజీవి చెప్పారు. బ్లడ్ డొనేట్ చేస్తున్న అభిమానులను పలకరించారు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వరుణ్ తేజ్
చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో వరుణ్ తేజ్