Laal Singh Chaddha Press Meet: లాల్ సింగ్ చద్దా ప్రెస్‌మీట్‌లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్యలతో చిరంజీవి
లాల్ సింగ్ చద్దా ప్రెస్‌మీట్‌లో ఆమీర్ ఖాన్, నాగ చైతన్యలతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీళ్లు ఫొటోలకు ఫోజులిచ్చారు.
లాల్ సింగ్ చద్దా ఆగస్టు 11వ తేదీన విడుదల కానుంది.
ఈ సినిమాలో ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించారు.
నాగచైతన్య కీలకమైన అతిథి పాత్రలో కనిపించనున్నారు.
తన పాత్ర నిడివి దాదాపు అరగంట వరకు ఉంటుందని నాగ చైతన్య తెలిపారు.
ఆగస్టు 11వ తేదీన అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’తో ఈ సినిమా పోటీ పడనుంది.
ఈ సినిమాను తెలుగులో కూడా డబ్ చేయనున్నారు.
తెలుగులో మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లతో లాల్ సింగ్ చద్దాకు కాంపిటీషన్ ఉంది.
ఈ మధ్యకాలంలో వచ్చిన బాలీవుడ్ సినిమాలు అన్నీ విఫలం అవుతున్నాయి.
దీంతో లాల్ సింగ్ చద్దా బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్‌పై మంచి అంచనాలు ఉన్నాయి.
ఆ అంచనాలను సినిమా అందుకుంటుందో లేదో తెలియాలంటే విడుదల అయ్యే వరకు ఆగాల్సిందే.