✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss Telugu 5 Contestants: బిగ్ బాస్ 5.. హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే

ABP Desam   |  06 Sep 2021 10:22 AM (IST)
1

బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో బిగ్ బాస్ ఇల్లు కళ్లకల్లాడుతోంది. ఎవరెవరు ఈ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో చూసేద్దామా. - Image Credit: Star Maa/Hotstar

2

బిగ్ బాస్ హౌస్‌లోకి సీరియల్ నటి, యూట్యూబర్ సిరి హన్మంత్ తొలి కంటెస్టెంట్‌గా అడుగు పెట్టింది. ‘భూమ్ బద్దల్’ సాంగ్‌తో సిరి డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ సందర్భంగా ఓ డైలాగ్‌ను నాగ్.. ఐదు రసాల్లో పలికించాలని కోరగా.. ఆమె చెసి చూపించింది. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండానే ఈ హౌస్‌లోకి వచ్చానని, ప్రేక్షకులకు కావల్సిన వినోదం ఇవ్వడానికి రెడీగా ఉన్నానని సిరీ ఈ సందర్భంగా తెలిపింది. అనంతరం నాగ్ ఆమెను హౌస్‌లోకి వదిలిపెట్టారు. దీంతో హౌస్ చూసి.. తన ఊతపదం ‘ఓడియమ్మ’ అనేసింది. - Image Credit: Star Maa/Hotstar

3

షోలో 2 కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు వీజే సన్నీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా సన్నీని ‘‘నువ్వు కోరుకొనే అమ్మాయి ఎలా ఉండాలో బొమ్మ గీసి చెప్పు అన్నారు. దీంతో సన్నీ ఓ బొమ్మ గీశాడు. ఆ బొమ్మతోనే సన్నీ హౌస్‌లోకి వెళ్లాడు. ఇది చూస్తే.. మీకు తప్పకుండా గత సీజన్‌లో అభి గుర్తుకొస్తాడు. ఎందుకంటే.. ఆ సీజన్‌లో నాగ్ కొంతమంది మోనల్ ఫొటో చూపిస్తే.. అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అభి చెప్పాడు. అతడు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత మోనల్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. సో.. సన్నీని కూడా అలాగే ప్రేమలో దింపాలని ‘బిగ్ బాస్’ ప్రయత్నిస్తున్నాడేమో. - Image Credit: Star Maa/Hotstar

4

మూడో కంటెస్టెంట్‌గా లహరి అడుగుపెట్టింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి హాట్‌గా ఎంట్రీ ఇచ్చింది. లహరి హౌస్‌లోకి వెళ్లగానే సన్నీ పులిహోర కలపడం మొదలుపెట్టాడు. నాగ్ వద్ద గీసిన డ్రీమ్ కలర్ బొమ్మతో లహరీని కంపేర్ చేసుకున్నారు. నేను స్మాల్ స్క్రీన్ మన్మథుడిని చెప్పుకున్నాడు. లహరీకి నాగ్ ఇచ్చిన రోజా పువ్వును తనకు ఇవ్వమనగా.. అది కేవలం తనకు నచ్చినవారికే నాగ్ ఇవ్వమన్నారని లహరీ తెలిపింది. - Image Credit: Star Maa/Hotstar

5

నాలుగో కంటెస్టెంట్‌గా గాయకుడు శ్రీరామ చంద్ర ఎంటర్ అయ్యాడు. మిక్స్‌డ్ ఎమోషన్స్‌తో బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ అవుతున్నానని శ్రీరామ్ తెలిపాడు. తాను ఇండియన్ ఐడల్ తర్వాత 500 పైగా సాంగ్స్ పాడానని తెలిపాడు. తనకు తెలుగులో పాటలు పాడాలని ఉందని, బిగ్ బాస్ ద్వారా తన పాటలను వినిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావాలని కోరుకుంటున్నానని శ్రీరామ చంద్ర పేర్కొన్నాడు. ఈ సందర్భంగా నాగార్జున కోసం ‘‘ఆమని పాడవే హాయిగా.. ’’ పాట పాడి వినిపించాడు శ్రీరామ చంద్ర. - Image Credit: Star Maa/Hotstar

6

ఐదవ కంటెస్టెంట్‌గా ప్రముఖ కొరియోగ్రాఫర్ యానీ మాస్టర్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ఏవీని ప్రదర్శించారు. తాను హైదరాబాద్ అమ్మాయినే అంటూ.. తన గురించి వివరించింది. బిగ్‌బాస్‌కు వెళ్తే.. తన అబ్బాయిని చాలా మిస్ అవుతానని తెలిపారు. ఈ సారి బిగ్‌బాస్‌ను అమ్మాయిలే గెలవాలనే లక్ష్యంతో వెళ్తున్నానని యానీ మాస్టర్ తెలిపారు. - Image Credit: Star Maa/Hotstar

7

6వ కంటెస్టెంట్‌గా లోబో ఎంట్రీ ఇచ్చాడు. తాను కార్టూన్ ఆర్టిస్టునని, తన తొలి టాటూ రష్యా అమ్మాయి వేశానని.. ఆమే తనకు లోబో అని పేరు పెట్టిందని తెలిపాడు. తాను 9వ తరగతి వరకు మాత్రమే చదివానని లోబో తెలిపాడు. నా పెళ్లయ్యి, కూతురు పుట్టిన తర్వాత నేను మారానని తెలిపాడు. ‘‘నా తండ్రి బతికి ఉండగా.. ఆయనకు విలువ ఇవ్వలేకపోయా. అందుకే రోజూ ఆయన సమాధి వద్దకు వెళ్తుంటా’’ అని లోబో భావోద్వేగానికి గురయ్యాడు. - Image Credit: Star Maa/Hotstar

8

7వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియా అడుగుపెట్టారు. ఈ సందర్భంగా చక్కని ఏవీతో ఆకట్టుకున్నారు. తన జీవిత ప్రయాణం గురించి ఆమె ఆ వీడియోలో వివరించారు. ఈ సందర్భంగా ఆమె తన కూతురి గురించి భావోద్వేగానికి గురయ్యారు. ‘‘నన్ను నేను తెలుసుకొనే ప్రయత్నం కోసమే బిగ్‌బాస్‌లోకి వచ్చాను’’ అని తెలిపింది. అనంతరం ప్రియా కొడుకు విషెస్‌ను స్టేజ్ మీద చూపించారు. - Image Credit: Star Maa/Hotstar

9

8వ కంటెస్టెంట్‌గా సూపర్ మోడల్ జెస్సీ ఎంటర్ అయ్యాడు. 36 గంటలు కంటిన్యూగా నాన్ స్టాప్ ర్యాంప్ వాక్ నిర్వహించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించారని నాగ్ ఈ సందర్భంగా తెలిపారు. - Image Credit: Star Maa/Hotstar

10

9వ కంటెస్టెంట్‌గా జబర్దస్త్ సాయితేజ (ఇప్పుడు ప్రియాంక సింగ్) అడుగు పెట్టింది. ఒకప్పుడు అబ్బాయిగా ఉన్న సాయి తేజ.. కొన్నాళ్ల కిందట లింగ మార్పిడితో అమ్మాయిగా మారాడు. ఈ సందర్భంగా స్పెషల్ ఏవీని స్టేజ్ మీద ప్రదర్శించారు. ఇందులో ప్రియాంక తన జీవితాన్ని కవితాత్మకంగా వినిపించింది. మదిని ఒప్పించని మార్గంలో మగువగా మారి ముందుకు సాగానంటూ.. తన గురించి రెండు ముక్కల్లో చెప్పేసింది. ‘‘మా నాన్నగారికి నేను లింగ మార్పిడి చేసుకున్నానని తెలీదు. మా నాన్నగారు కాలేజ్‌లో ల్యాబ్ అటెండర్‌గా పనిచేసేవారు. చిన్న ప్రమాదంలో ఆయన చూపుకోల్పాయారు. నాకు సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. ఓ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకూడదనే ఉద్దేశంతో.. లైంగిక మార్పిడి చేసుకున్నాను. మీరు తలదించుకొనే పని ఎప్పుడూ చేయను’’ అని ప్రియాంక ఈ సందర్భంగా తెలిపింది. నాగ్ కూడా ఆమె నిర్ణయానికి మద్దతు తెలిపారు. - Image Credit: Star Maa/Hotstar

11

యూట్యూబ్ స్టార్ షన్ముఖ్ జస్ంత్ 10వ కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లాడు. ‘హూ ఆర్ యూ’ పాటకు దుమ్ములేపాడు. షన్ముఖ్ ఎంటర్ కాగానే ‘అరే ఎంట్రా ఇది’ అని నాగ్ పలకరించడం విశేషం. బిగ్‌ బాస్‌లో నేగిటివిటీని ఎలా ఎదుర్కొంటావు అనే ప్రశ్నకు జస్వంత్.. తాను ఇంకా ఏదీ ప్రిపేర్ కాలేదని చెప్పాడు. - Image Credit: Star Maa/Hotstar

12

11వ కంటెస్టెంట్‌గా సినీ నటి హమీదా హౌస్‌లోకి వచ్చింది. ‘‘రంభ.. ఊర్వసి.. మేనక..’’ పాటకు హాట్ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగ్ ఆమెకు కొందరి హౌస్ మేట్స్ కళ్లు చూపించారు. అందులో మీకు ఏ కళ్లు నచ్చాయో చెప్పాలని అడిగారు. దీంతో ఆమె ‘డి’ని ఎంపిక చేసింది. దీంతో నాగ్.. హౌస్‌లో ఉన్న ఒకరికి మీరు నచ్చిన కళ్లు ఉంటాయని చెప్పారు. - Image Credit: Star Maa/Hotstar

13

కొరియోగ్రాఫర్ నటరాజ్ 11వ కంటెస్టెంట్‌గా స్టేజ్ మీద అడుగు పెట్టారు. ముందుగా ఆయన ఏవీని ప్రదర్శించారు. ‘పుష్ప’లోని ‘‘పులొచ్చి కొరుద్ది పీక’’ పాటతో నటరాజ్ జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు. సర్‌ప్రైజ్‌గా నాగ్.. గర్భంతో ఉన్న నటరాజ్ భార్యను స్టేజ్ మీదకు పిలిచారు. దీంతో నటరాజ్, ఆయన భార్య భావోద్వేగానికి గురయ్యారు. - Image Credit: Star Maa/Hotstar

14

13వ కంటెస్టెంట్‌గా ‘7 ఆర్ట్స్’ సరయు బోల్డ్ ఎంట్రీ: యూట్యూబ్‌లోని ‘7 ఆర్ట్స్’ చానెల్ ద్వారా గుర్తింపు పొందిన సరయు 13వ కంటెస్టెంట్‌గా స్టేజ్ మీదకు అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఓ బోల్డ్ ఏవీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా తాను దమ్ దమ్ చేస్తానంటూ తనదైన శైలిలో నాగ్ చెప్పింది. ‘మింగేయ్’ అంటూ తన బూతు పురాణం ఎత్తింది. చిన్నప్పుడు తన తల్లి ఐస్ క్రీమ్ తినేందుకు వెళ్లింది. బ్రెజీలియన్ లవ్ సాంగ్ అనే ఐస్ క్రీమ్ తినడానికి వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియో చూపించింది. అందులో వెళ్దామంటే సినిమా నటులే వెళ్తారని చెప్పింది. అప్పుడే అమ్మతో అన్నాను ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలని అనుకున్నాను. ఈ రోజు మీ ముందు నిలుచున్నా’’ అని సరయు తెలిపింది. ఈ సందర్భంగా నాగ్.. ‘‘నువ్వు కోరుకున్నట్లే.. అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నావ్. అన్నపూర్ణగారి అబ్బాయి ముందు ఉన్నావు’’ అని చెప్పి ఆమెను హౌస్‌లోకి పంపారు. - Image Credit: Star Maa/Hotstar

15

బిగ్‌బాస్‌లో 14వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు విశ్వ అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతడి ఏవీని ప్రదర్శించారు. చీకటిని వెనక్కి నెట్టి వెలుగులోకి వస్తున్నాడు మీ విశ్వా.. అంటూ హీరో స్టైల్‌లో వచ్చాడు. కేజీఎఫ్‌ టైటిల్ సాంగ్‌తో బైకు మీద స్టేజ్ మీదకు వచ్చాడు. ఈ సందర్భంగా చేతితో యాపిల్ పండును తన కండలతో పగలగొట్టే టాస్క్‌ను నాగ్ ఇచ్చారు. - Image Credit: Star Maa/Hotstar

16

హౌస్‌లో 15వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ఉమాదేవి స్టేజ్ మీదకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఏవీని ప్రదర్శించారు. ‘‘సమాజం ఏమనుకుంటుదనే విషయాన్ని పక్కన పెట్టి నేను నటించాను. 18 ఏళ్లకే ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తర్వాత విడిపోయాం. ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశాం. నా పిల్లలే నా ప్రపంచం. వారి కోసమే నేను బతుకుతున్నా’’ అని తెలిపింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లింది. - Image Credit: Star Maa/Hotstar

17

హౌస్‌లోకి 16వ కంటెస్టెంట్‌గా సీరియల్ నటుడు మానస్ అడుగుపెట్టాడు. ఆరు అడుగుల బుల్లెట్ పాటతో స్టైలిష్‌గా స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చాడు. - Image Credit: Star Maa/Hotstar

18

17వ కంటెస్టెంట్‌గా ఆర్జే కాజల్: చక్కని ఏవీతో అడుగుపెట్టింది కాజల్. కట్టుబాట్ల పరదాను దాటి.. మతాంతర వివాహంతో తన జీవితం గురించి చెప్పుకొచ్చింది. అనంతరం స్టేజ్ మీద గల గల మాట్లాడేస్తూ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగార్జునతో ‘ఐ లవ్ యూ’ చెప్పించుకోవాలనే కోరికను తీర్చుకుంది. గాయని జానకి గొంతుతో ‘‘నరుడు ఓ నరుడా’’ పాట పడింది. అనంతరం హౌస్‌లో అడుగు పెట్టింది. - Image Credit: Star Maa/Hotstar

19

హౌస్‌లోకి 18వ కంటెస్టెంట్‌గా సినీ నటి శ్వేతా వర్మ అడుగు పెట్టింది. ‘బాహుబలి’ సినిమాలోని ‘‘ధీవరా..’’ పాటతో స్టేజ్ మీదకు వచ్చింది. నాగ్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘‘నన్ను ట్రిగర్ చేస్తే.. దేత్తడి పోచమ్మ గుడే.. ఇచ్చి పడేస్తా’’ అంటూ సంకేతాలు పంపింది. అనంతరం హౌస్‌లోకి వెళ్లింది. - Image Credit: Star Maa/Hotstar

20

హౌస్‌లోకి 19వ కంటెస్టెంట్‌గా యాంకర్ రవి ఎంట్రీ ఇచ్చాడు. ‘‘నీకు పెళ్లయ్యిందని నాకు తెలీదు. నాకు కూడా చెప్పలేదు. పెళ్లిలా ఇంకా ఎన్ని సీక్రెట్లు దాచి పెట్టావు?’’ అని అడిగారు. ‘‘హౌస్‌లో రియల్‌గా ఉండాలని అనుకుంటున్నా’’ అని రవి ఈ సందర్భంగా తెలిపాడు. నాగ్ సర్‌ప్రైజ్‌గా రవి కుమార్తె పంపిన గ్రీటింగ్‌ను ఇచ్చారు. పాప వాయిస్ మెసేజ్‌ను స్టేజ్ మీద వినిపించారు. దీంతో రవి భావోద్వేగానికి గురయ్యాడు. అనంతరం రవి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. - Image Credit: Star Maa/Hotstar

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss Telugu 5 Contestants: బిగ్ బాస్ 5.. హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.