Sonia Akula : బిగ్‌బాస్‌లో అప్పుడు రతిక, ఇప్పుడు సోనియా.. ఎలిమినేట్ అయింది నాలుగోవారమే.. రీఎంట్రీ కూడా ఉంటుందా?
బిగ్‌బాస్ సీజన్ 8లో సోనియా ఎలిమినేషన్ అయిపోయింది. అయితే సీజన్ ప్రారంభంలో ఆమెను రతికతో కంపేర్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమె బయటకు వచ్చినట్టే ఈమె కూడా వచ్చిందంటున్నారు.(Images Source : Star Maa)
బిగ్‌బాస్ సీజన్ 8లోకి వెళ్లి సోనియా ఆకుల.. తన గేమ్‌ను ఆపి.. లవ్ ట్రాక్ నడిపించేందుకు ట్రై చేసిందని.. ఆమె ఆడకుండా ఇతరుల ఆటను పెట్టుకుని గేమ్‌లో ముందుకెళ్లిందని అంటున్నారు. అందుకే ఆమె ఎలిమినేట్ అయిపోవాలనుకున్నారు.(Images Source : Star Maa)
గత సీజనలో వచ్చిన రతిక రోజ్ కూడా ఇదే ట్రాక్‌లో వెళ్లి.. హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది. అయితే ఈ భామ మళ్లీ హౌజ్‌లోకి రీఎంట్రీ కూడా ఇచ్చింది. (Images Source : Star Maa)
ఇప్పుడు నాలుగో వారమే ఎలిమినేట్ అయిన సోనియా కూడా హౌజ్‌లోకి రీఎంట్రీ ఇస్తుందా అనే ప్రశ్న చాలామంది ఆడియన్స్‌లో ఉంది. అయితే ఆమె మ్యాగ్జిమమ్ హౌజ్‌లోకి రాదనే వార్తలే వినిపిస్తున్నాయి. (Images Source : Star Maa)
సోనియా ఇంట్లో ఉన్నప్పుడు నిఖిల్, పృథ్వీపై పెట్టినంత శ్రద్ధ గేమ్‌పై పెట్టలేదని కంటెస్టెంట్లు కూడా ఆమె మొహంపై చెప్పారు. ఈ వారం నాగార్జున కూడా అదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ కారణాలవల్ల ఆమెకు ఆడియన్స్‌లో ఆదరణ దక్కలేదు. ఎప్పుడెప్పుడు నామినేషన్స్‌లోకి వస్తుందోనని ఎదురు చూశారు.(Images Source : Star Maa)
రతిక రోజ్కి లక్ కలిసి వచ్చి హౌజ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది కానీ.. దానిని నిలబెట్టుకోలేకపోయింది. బిగ్‌బాస్ కంటెంట్ కోసం ఇప్పుడు కొందరిని నెక్స్ట్ వారం హోజ్‌లోకి పంపించనున్నారు. వారి లిస్ట్‌లో సోనియా ఉంటే ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.(Images Source : Star Maa)