Rathika: ‘బిగ్ బాస్’ హౌస్‌లో అదిరేటి బ్యూటీ - రతికా ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
2016లో ముందుగా ఒక స్టాండప్ కామెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది రతిక. కానీ అప్పట్లో తన పేరు రతిక కాదు.. ప్రియా. - Image Credit: Rathika/Instagram
ఒకప్పుడు ఈటీవీ ప్లస్‌లో వచ్చే ‘పటాస్’ అనే స్టాండప్ కామెడీ షోలో ఒక స్టాండప్ కామెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించింది ప్రియా. అలా ‘పటాస్’లో తన ప్రయాణం దాదాపు ఏడాది వరకు సాగింది. - Image Credit: Rathika/Instagram
ఆ తర్వాత తను ఆ షోలో కనిపించడం మానేసింది. అసలు తను ఏమైంది, ఏంటి అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తనను తాను బెటర్ చేసుకోవడం కోసం బ్రేక్ తీసుకొని, రతికగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. - Image Credit: Rathika/Instagram
మోడల్‌గా ఫుల్ టైమ్ బిజీ అయిపోయింది. మోడల్‌గా చేస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలను అందుకుంది. - Image Credit: Rathika/Instagram
తెలుగులో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది రతిక. మెల్లగా తమిళంలో నుండి కూడా తనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. - Image Credit: Rathika/Instagram
‘మారో’ అనే తమిళ చిత్రంలో నటిగా తన తమిళ డెబ్యూకు సిద్ధమయ్యింది రతిక. కానీ ఇంకా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. - Image Credit: Rathika/Instagram
ఇప్పటివరకు విడుదలయిన సినిమాలు కూడా తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తను చేసే పోస్టులు మాత్రం ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటాయి. రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తను ఏ ఫోటో పెట్టినా వెంటనే వేలల్లో లైక్స్ వచ్చి పడతాయి. - Image Credit: Rathika/Instagram
రతిక.. చివరిగా గణేష్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. తను చేసిన ఇతర సినిమాల్లో పోలిస్తే.. ఈ మూవీలో తన క్యారెక్టర్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పోలీసుగా తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది రతిక. - Image Credit: Rathika/Instagram
రతిక - Image Credit: Rathika/Instagram