Sarayu: సరయు.. ఈ చక్కని చుక్క నోరు తెరిస్తే.. బిగ్ బాసైనా బెదరాల్సిందే
సరయు.. ‘7 ఆర్ట్స్’ కల్ట్స్‌కు ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే, ఈమె గురించి తెలియనివారు మాత్రం.. తప్పకుండా తెలుసుకోవాలి.
సరయు సాధారణ మహిళ కాదు.. కిలాడి. శత్రువులను ఎదుర్కోడానికి ఈమెకు ఆయుధాలు అక్కర్లేదు. జస్ట్ నోరు తెరిస్తే చాలు.. చచ్చిపోతారు.
సరయు నోరు తెరిస్తే బూతులే అనుకుంటారు. కానీ, ఆమె చెప్పే బూతు సామెతలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
సరయు నటించిన షార్ట్ ఫిల్మ్స్‌లో ఒక్క బూతు లేకపోయినా అది వింతే.
సరయు నటించిన షార్ట్ ఫిల్మ్స్‌లో బూతులను పక్కన పెడితే.. ప్రతి అంశంలో సమాజానికి ఓ సందేశం ఉంటుంది.
సరయు అంటే బూతు సందేశమనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఈ రోజుల్లో నీతులు చెప్పే వీడియోలను ఎవరూ చూడరు. అందుకే, సరయు టీమ్ ఈ సరికొత్త మార్గాన్ని ఎంచుకుంది. బూతులతో ఆకట్టుకుని.. సందేశంతో కళ్లు తెరిపించడం సరయు స్టైల్. అందుకే.. ఆమెను అందరూ అభిమానిస్తారు.
అందం, అభినయం కలిగిన సరయు.. మరి బిగ్ బాస్ ద్వారా సాధారణ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.
ఆల్ ది బెస్ట్.. సరయు