Tamanna Bhatia: బ్లాక్ డ్రెస్ లో మెరిసిపోతున్న బబ్లీ బౌన్సర్
మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ టు నార్త్.. పలు భాషల్లో వరుస అవకాశాలను దక్కించుకుంటోంది.
దక్షిణాదిలో తమన్నాకు మంచి హిట్సే ఉన్నాయి. బాలీవుడ్‌లో మాత్రం చెప్పుకోదగిన హిట్ దక్కలేదు.
బాలీవుడ్ లో తమన్నా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ దర్శకత్వంలో ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా చేస్తోంది.
‘బబ్లీ బౌన్సర్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ తాజాగా విడుదలైంది. మాస్ లుక్ లో మిల్కీ బ్యూటీ ఆకట్టుకుంటుంది.
‘బబ్లీ బౌన్సర్’ సినిమాలో మగ రాయుడిగా బలాదూర్ తిరిగే అమ్మాయిగా తమన్నా కనిపిస్తుంది.
‘బబ్లీ బౌన్సర్’ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. సెప్టెంబర్ 23 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది.
దేశంలో తొలిసారిగా ఓ లేడీ బౌన్సర్ కథ ఆధారంగా వస్తున్న తొలి సినిమా ‘బబ్లీ బౌన్సర్’.
తెలుగులో చిరంజీవి సరసన ‘భోళా శంకర్‘ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.
సత్యదేవ్ తో కలిసి ‘గుర్తుందా శీతాకాలం‘ సినిమాలో తమన్నా నటించింది.
‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో తమన్నా బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకోవడం ఖాయం అని అంటున్నారు సినీ అభిమానులు.