సెంట్రల్ విస్టా అవెన్యూ న్యూ లుక్ అదుర్స్
ఢిల్లీలోని రాజ్‌పథ్‌కు కొత్త కళ వచ్చింది. సెంట్రల్ విస్టా అవెన్యూ కొత్త లుక్‌లో మెరిసిపోతోంది.
ఈ రీడెవలప్‌మెంట్‌కు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా వెండింగ్ జోన్‌లు ఏర్పాటు చేశారు.
ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకు దాదాపు 2 కిలోమీటర్ల మేర ఈ అవెన్యూని అందంగా తీర్చి దిద్దారు.
సెప్టెంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ఈ అవెన్యూని ప్రారంభించనున్నారు.
ప్రధాని మోదీ ప్రారంభించాక దీన్ని చూసేందుకు సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు.
ప్రస్తుత పార్లమెంట్ భవనం కంటే 17వేల చదరపు కిలోమీటర్లు పెద్దది..ఈ సెంట్రల్ విస్టా అవెన్యూ.
దేశ చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించినట్టు గతంలోనే కేంద్రం వెల్లడించింది.
లాన్స్ వద్ద ఉన్న చిన్న కెనాల్స్‌పై 16 బ్రిడ్జ్‌లను నిర్మించారు. (Images Credits: ANI)