Atharva Movie : కార్తీక్ రాజు 'అథర్వ'కు తెలంగాణ ఫోరెన్సిక్ లేబరేటరీ అభినందన
కార్తీక్ రాజు హీరోగా నటించిన సినిమా 'అథర్వ'. ఇందులో సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లు. మహేష్ రెడ్డి దర్శకత్వం వహించారు. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సుభాష్ నూతలపాటి నిర్మించారు. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. తాజాగా పోలీస్ శాఖలోని క్లూస్, ఫోరెన్సిక్ విభాగం వారు సినిమా చూశారు. (Image Courtesy : T-Series Telugu / YouTube)
ఓ క్రైమ్ ఎలా జరిగింది? ఎవరు చేశారు? అని పోలీసులు పరిష్కరించాలంటే క్లూస్ టీం ప్రాముఖ్యత ఎంత ఉంటుందనే అంశంతో పాటు నేరస్థులను పట్టుకునేందుకు క్లూస్, ఫోరెన్సిక్ శాఖలు పడే కష్టాన్ని చూపిస్తూ... సస్పెన్స్, క్రైమ్ జానర్లో అన్ని రకాల ఎమోషన్స్‌తో తెరకెక్కించిన సినిమా 'అథర్వ' అని చిత్ర బృందం పేర్కొంది. (Image Courtesy : T-Series Telugu / YouTube)
తెలంగాణ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ అడిషనల్ డైరెక్టర్ డా. అనిత ఎవాంజెలిన్ మాట్లాడుతూ... ''పోలీస్ శాఖలో క్లూస్ టీం ఎంత ప్రముఖమైంది?అనేది చూపించారు. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. మా వాళ్ళను హీరోల్లా చూపించారు. ఫోరెన్సిక్, క్లూస్ డిపార్ట్మెంట్లు వేరు. ఈ సినిమా మా అందరికీ ఓ నివాళి. మా కష్టాన్ని అందరికీ తెలిసేలా తీసిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలి'' అని అన్నారు. (Image Courtesy : T-Series Telugu / YouTube)
హైదరాబాద్ సిటీ పోలీస్, క్లూస్ జాయింట్ డైరెక్టర్ డా. వెంకన్న మాట్లాడుతూ... ''మహేష్ గారు ఈ కథను ముందు నాకు చెప్పారు. క్లూస్ టీంను ఎలా చూపిస్తారా? అనుకున్నాను. అద్భుతంగా తెరకెక్కించారు. చివరి వరకు ఉత్కంఠ భరితంగా తీశారు. రెగ్యులర్ గా క్రైమ్ సీన్లు చూస్తాం కనుక ఆ జానర్ సినిమా చూడను. కానీ, ఈ 'అథర్వ' మాత్రం అద్భుతంగా ఉంది. క్రైమ్ సీన్ ఆఫీసర్ అంటే 'అథర్వ'లో కార్తీక్ రాజు తరహాలో ఉండాలని చూపించారు'' అని అన్నారు. (Image Courtesy : T-Series Telugu / YouTube)
'అథర్వ'ను సుమారు 100 మందికి పైగా క్రైమ్ సీన్ ఆఫీసర్లు చూశారని, అందరికీ సినిమా నచ్చిందని చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సినిమా 'అథర్వ' డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. (Image Courtesy : T-Series Telugu / YouTube)
'అథర్వ' సినిమాలో కార్తీక్ రాజు (Image Courtesy : T-Series Telugu / YouTube)