Anupama Parameswaran: ‘ఉప్మా’ వద్దు, అనుపమా ముద్దు - బర్త్‌డే డ్రెస్‌లో ఎంత ముద్దుగా ఉందో చూడండి
అనుపమా పరమేశ్వరన్.. కుర్రాళ్ల పర్మినెంట్ క్రష్. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుని ఫుల్ ఖుషీగా ఉంది. మన యూత్ అంతా ఆమెను అను ఉప్మా అని ముద్దుగా పిలుచుకుంటారు. ఆ పిలుపంటే.. అనుపమకు కూడా చాలా ఇష్టమండి. కానీ, ఇష్టమంది కదా అని అదేపనిగా పిలవకండి. అనుపమా వంటి అందమైన పేరు ఉన్నప్పుడు.. అనవసరంగా మనకు ఇష్టంలేని ఉప్మాతో పోల్చడం ఎందుకు చెప్పండి. మొన్నటి వరకు పక్కింటి అమ్మాయిలా.. ఎంతో సాంప్రదాయకంగా కనిపించిన అనుపమా.. అకస్మాత్తుగా రూటు మార్చింది. ‘రౌడీ బాయ్స్’ సినిమాలో ఒక్కసారిగా కిస్సింగ్ క్వీన్ అయిపోయింది. కరోనా వచ్చినా హుషారుగా కాలర్ ఎగరేసుకుని తిరిగేసిన కుర్రాళ్లు.. ఆ సీన్స్ చూసి ఒక్కసారే మంచాన్న పడ్డారు. చాలామంది గుండె పగిలిందని హెల్త్ రిపోర్ట్స్ అందాయి. మరి అనుపమా అదే రూటులో కొనసాగుతుందా? లేదా మళ్లీ పాత రూటులోకే వచ్చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ‘కార్తికేయ-2’, ‘18 పేజేస్’, ‘బటర్‌ఫ్లై’ సినిమాలు సిద్ధమవుతున్నాయి. శుక్రవారం అనుపమా పరమేశ్వరన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాల్లో ఆమె లుక్‌ను రిలీజ్ చేశారు. అలాగే అను బేబీ కూడా బర్త్‌డే నేపథ్యంలో అచ్చతెనుగు పడుచులా ముస్తాబైన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. వాటిని ఇక్కడ చూసేయండి. - Image Credit: Anupama Parameswaran/Instagram
‘ఉప్మా’ వద్దు, అనుపమా ముద్దు - బర్త్‌డే డ్రెస్‌లో ఎంత ముద్దుగా ఉందో చూడండి - Image Credit: Anupama Parameswaran/Instagram

బటర్ ఫ్లై మూవీలో అనుపమ
18 పేజీస్‌లో అను
కార్తికేయ 2లో అనుపమా