Anchor Sreemukhi : ట్రెడీషనల్ లుక్స్‌లో మోడ్రన్ ఎలిగెన్స్ ఇస్తున్న శ్రీముఖి
యాంకర్ శ్రీముఖి ట్రెడీషనల్ లుక్‌లో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఒంటి నిండా నగలు పెట్టుకుని.. పట్టు చీర కట్టుకుని.. జడ వేసుకుని తల్లో పూలు పెట్టుకుని అచ్చం తెలుగమ్మాయి వైబ్స్ ఇస్తుంది. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు మోడ్రన్ ఎలిగెన్స్‌తో ఫోటోలకు ఫోజులిచ్చింది.(Image Source : Instagram/sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడిజైనర్ బ్లౌజ్‌తో తన శారీ లుక్‌ని సెట్ చేసింది ఈ యాంకర్. ఈ ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేస్తూ.. “Where timeless tradition meets modern elegance. Discover the impeccable craftmanship with dazzling maggam designs that make your special day unforgettable.” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Image Source : Instagram/sreemukhi)
తెలుగులో యాంకర్‌గా పేరుపొందిన శ్రీముఖి.. ముందు నటిగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. జులాయి సినిమాలో అల్లు అర్జున్‌కు చెల్లెల్లుగా నటించి వెండితెరకు పరిచయమైంది. (Image Source : Instagram/sreemukhi)
ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో ప్రధాన నటిగా కూడా మెప్పించింది. తర్వాత నేను శైలజ సినిమాలో హీరో రామ్‌కి సిస్టర్‌గా నటించింది. తర్వాత ఆఫర్లు తగ్గడంతో కెరీర్‌ను బుల్లితెరవైపు మల్లించింది. యాంకర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి ఇప్పుడు తెలుగులోనే మంచి యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకుంది.(Image Source : Instagram/sreemukhi)
పటాస్ అనే షో యాంకర్‌గా శ్రీముఖి పేరు మార్మోమ్రోగిపోయింది. ఆమె వేసే పంచులు, ఓసేయ్ రాములమ్మ స్టెప్లు ఓ రేంజ్లో ట్రెండ్ అయ్యాయి. అలా యాంకర్‌గా పీక్‌లో ఉన్న సమయంలోనే బిగ్‌బాస్ హౌజ్‌లోకి వెళ్లింది. టైటిల్ విన్నర్ శ్రీముఖి అనే రేంజ్లో గేమ్ ఆడింది. కానీ రన్నరప్‌గా నిలిచింది.(Image Source : Instagram/sreemukhi)
బిగ్‌బాస్ తర్వాత పలు షోలు, గేమ్ షోలు, ఈవెంట్స్‌తో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తన కేరీర్ విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. యాంకర్‌గా నటిస్తూనే సినిమాల్లో అడపా దడపా కనిపిస్తుంది. 2023లో భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది.(Image Source : Instagram/sreemukhi)
బుల్లి తెర, వెండితెరనే కాకుండా శ్రీముఖికి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దానిలో టూర్స్, వంటలు, కొత్త ప్లేస్‌లు ఎక్స్ప్లోర్ చేసే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. వ్లాగ్స్ చేస్తూ.. అభిమానులను నవ్విస్తూ ఉంటుంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఎక్కువ ప్రాధన్యత ఇస్తూ ఉంటుంది. ఆమె వీడియోలు చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.(Image Source : Instagram/sreemukhi)