Allu Arjun Multiplex: అమీర్‌పేటలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఇదే.. సత్యం థియేటర్ ఇకపై AAA సినిమాస్!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో సత్యం థియేటర్ గురించి తెలియనివారంటూ ఎవరూ ఉండరు. త్వరలో ఈ థియేటర్ మల్టిప్లెక్స్‌గా సినీ ప్రియులను ఆకట్టుకోనుంది.
అల్లు అరవింద్, నారాయణ్ దాస్ నారంగ్, మురళీ మోహన్, ఎన్ సదానంద్ గౌడ్‌ల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న ఈ మల్టిప్లెక్స్ AAA Cinemas పేరుతో వినోదాన్ని అందించనుంది.
AAA మల్టీపెక్స్ నిర్మాణం కోసం శుక్రవారం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో అల్లు అర్జున్ ప్రత్యేక అతిథిగా విచ్చేశాడు.
ప్రస్తుతం ఇక్కడ మాల్ నిర్మాణం పూర్తయ్యింది. ఇక మల్టిప్లెక్స్ నిర్మాణం ఒకటే మిగిలి ఉంది. ఈ సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బన్నీతోపాటు నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్ తదితరులు పాల్గొన్నారు.
వరల్డ్ క్లాస్ విజువల్స్, ఆడియో ఎక్స్‌పీరియన్స్‌తో AAA మల్టీప్లెక్స్ ప్రేక్షకులను మైమరపిస్తోందని అంటున్నారు. అయితే, ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుందనే విషయాన్ని వెల్లడించలేదు.
అమీర్‌పేటలో అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ ఇదే.. సత్యం థియేటర్స్ ఇకపై AAA సినిమాస్!