✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Sumanth Second Marriage: అక్కినేని ఫ్యామిలీ హీరో రెండో పెళ్లి!

ABP Desam   |  28 Jul 2021 12:57 PM (IST)
1

అక్కినేని మేనల్లుడు సుమంత్ మరో పెళ్లి చేసుకుంటున్నాడా..? అనే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దాదాపు పదిహేనేళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్నాడు సుమంత్. 'ప్రేమ కథ' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు 'సత్యం' సినిమాతో హిట్ అందుకున్నాడు.

2

ఆ తరువాత 'గోదావరి', 'గోల్కొండ హైస్కూల్' లాంటి సినిమాలు హీరోగా అతడికి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. కానీ ఆ తరువాత వరుస ప్లాప్ లు రావడంతో డీలా పడ్డాడు. ఈ మధ్యకాలంలో మళ్లీ కొన్ని సినిమాలు చేశాడు. కానీ ఏదీ కలిసిరాలేదు. మొన్నా మధ్య చేసిన 'మళ్లీ రావా' సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.

3

ఇదిలా ఉండగా.. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2004లో హీరోయిన్ కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సుమంత్. అయితే పెళ్లైన రెండేళ్లకే ఈ జంట విడిపోయింది. కీర్తి రెండో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. కానీ సుమంత్ మాత్రం రెండో పెళ్లి ఆలోచన చేయలేదు. అయితే ఇన్నాళ్లకు ఆయన పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తోంది.

4

త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు పవిత్ర అని తెలుస్తోంది. ఈ పెళ్లి ఏర్పాట్లు చాలా సైలెంట్ గా జరుగుతున్నాయని సమాచారం. అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Sumanth Second Marriage: అక్కినేని ఫ్యామిలీ హీరో రెండో పెళ్లి!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.