Akkineni Nageswara Rao: అక్కినేని నాగేశ్వరరావు అరుదైన చిత్రాలు.. 41 ఏళ్ల కిందట అన్నపూర్ణ స్టూడియో ఇలా ఉండేది
తెలుగు సినీ పరిశ్రమకు ఊపిరి అందించిన దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు. ఈ రోజు (సెప్టెంబరు 20) అక్కినేని జయంతి. 1923వ సంవత్సరం, కృష్ణాజిల్లాలోని రామాపురంలో వెంకటరత్నం, పున్నమ్య దంపతులకు పుట్టిన సంతానం ఆయన. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన నటనపై ఆసక్తితో చెన్నై నగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తనని తాను గొప్ప నటుడిగా నిరూపించుకున్నారు. సుమారు 255 చిత్రాల్లో నటించిన ఆయన దాదా సాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభుషన్ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. - Image Credit: Nagarjuna Akkineni/Twitter
అక్కినేని నాగేశ్వరరావు కేవలం నటుడిగానే కాదు.. నిర్మాతగా కూడా అనేక చిత్రాలను నిర్మించారు. ‘దొంగరాముడు’ మొదలకుని ‘సిసింద్రీ’ వరకు అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్‌తో నిర్మించనవే. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఆయన కుమారులు అక్కినేని నాగార్జున, వెంకట్‌లు సినిమాలు నిర్మిస్తున్నారు. - Image Credit: Nagarjuna Akkineni/Twitter
నేడు ఎంతోమంది కళాకారులకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ స్టూడియోను హైదరాబాద్‌లో నిర్మించిన ఘనత కూడా అక్కినేని నాగేశ్వరరావుకే దక్కుతుంది. ఒకప్పుడు చెన్నైకే పరిమితమైన సినీ పరిశ్రమను హైదరాబాదులో కేంద్రీకరించేందుకు అక్కినేని ఎంతో కృషి చేశారు. - Image Credit: Nagarjuna Akkineni/Twitter
నిర్మాత దుక్కిపాటి మధుసూదన రావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు, కొరటాల ప్రకాశరావు, టీవీఏ సూర్యరావులతో కలిసి అక్కినేని ఈ స్టూడియో స్థాపించారు. 22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ స్టూడియోను 1975లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలి అహ్మద్ చేతులు మీదుగా ప్రారంభించడం విశేషం. - Image Credit: Nagarjuna Akkineni/Twitter
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభోత్సవం నాటి చిత్రం - Image Credit: Nagarjuna Akkineni/Twitter
బాల్యం నుంచి నాటకాల మీద ఉన్న ఆసక్తితో అక్కినేని 1941లో పి.పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ధర్మపత్ని’ చిత్రం ద్వారా బాల నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత 1944 లో ఘంటసాల బలరామయ్య తెరకెక్కించిన ‘సీతారామ జననం’ సినిమాలో పూర్తి స్థాయి కథానాయకుడిగా నటించారు. - Image Credit: Nagarjuna Akkineni/Twitter
1953లో విడుదలైన ‘దేవదాసు’ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆయన ప్రదర్శించిన నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
అక్కినేని తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల్లో అక్కినేని నటించడం గమనార్హం. అక్కినేని నటించిన ఆఖరి చిత్రం.. ‘మనం’. ఈ చిత్రంలో ఆయన తన కుమారుడు నాగార్జున, మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ (అతిథి పాత్ర) నటించడం గమనార్హం.
భార్య అన్నపూర్ణతో అక్కినేని.. పెళ్లినాటి చిత్రం
కొడుకు నాగార్జునతో అక్కినేని నాగేశ్వరరావు- Image Credit: Nagarjuna Akkineni/Twitter
ఎన్టీఆర్, ఘంటసాలతో ఏఎన్నార్
మహానటి సావిత్రితో అక్కినేని
కుటుంబ సభ్యులతో అక్కినేని నాగేశ్వరరావు (Image Credits: Annapurna Studios and Akkineni Nagarjuna/Twitter and Instagram