Aishwarya Rajesh: 'డస్కీ బ్యూటీ' ఐశ్వర్య రాజేష్ స్టన్నింగ్ లుక్ - ఈ లుక్‌లో ఏముందిరా బాబూ మతిపోతుంది!
Aishwarya Rajesh Photos: కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రామిసింగ్ హీరోయిన్స్ లో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈమె తెలుగు హీరోయినే అయినా తమిళంలోనే ఎక్కువ గుర్తింపు పొందింది.
కోలీవుడ్ నుంచే తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టడంతో ఆమెకు తమిళ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది.
'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
తొలి చిత్రంతోనే లేడీ ఒరియంటెడ్ కావడం, యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న రోల్ రావడంతో నటనపరంగా ఇక్కడ మంచి మార్కులు కొట్టేసింది. 'డస్కీ బ్యూటీ' అంటూ ఫ్యాన్స్ ముద్దుగా ఆమెను పిలుచుకుంటారు.
ఐశ్వర్య గ్లామరస్ రోల్స్ కంటే కూడా లేడీ ఒరియంటెడ్ చిత్రాలు చేస్తూ కెరీర్‌లో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఈ భామ 'డియర్' మూవీతో తమిళ్, తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది.
ఈ చిత్రంలో ఆమె గురక పెట్టే భార్య పాత్రలో అలరించింది. ఇదిలా ఉంటే సినిమాల్లో డిగ్లామర్‌గా కనిపించే ఐశ్వర్య సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ షో చేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ జీన్స్, షర్ట్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ లుక్‌లో ఐశ్వర్యను చూసి అంతా ఫిదా అవుతున్నారు.
హాలీవుడ్ భామలా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.