Aishwarya Lekshmi : తెల్ల చీరలో దేవకన్యలా ఉన్న 'పొన్నియన్ సెల్వన్ ' బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి!
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ప్రాజెక్ట్.. పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో సముద్రకుమారిగా నటించి మెప్పించింది ఐశ్వర్య లక్ష్మి. మట్టికుస్తీ, గాడ్సే, అమ్ము, కింగ్ ఆఫ్ కోతా సినిమాలతోనూ హిట్స్ అందుకుంది...
‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సాయిధరమ్ తేజ్ కొత్త ప్రాజెక్ట్ కి రోహిత్ కేపీ దర్శకుడు. ఈ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది ఐశ్వర్య లక్ష్మి. సాధారణంగా మెగా హీరోల్లో ఒకరితో నటించే అవకాశం వస్తే ఆ తర్వాత చేతిలో అరడజను ఆఫర్స్ ఉన్నట్టే అంటారు.
సాయిధరమ్ - ఐశ్వర్య లక్ష్మి నటిస్తోన్న ఈ మూవీ టైటిల్ ‘సంబరాల ఏటి గట్టు’ అని పరిశీలనలో ఉంది. 1947లో ఓ ఊర్లో ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఇంకా ఈ మూవీలో కన్నడ, మలయాళ నటులు కూడా కనిపించబోతున్నారట.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య లేటెస్ట్ గా ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫొటోస్ ఇవి...
తెల్ల చీరలో సముద్ర కుమారి అందం వర్ణనాతీతం అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు
ఐశ్వర్య లక్ష్మి (Image credit: Aishwarya Lekshmi/Instagram)