Sumaya Reddy: రైటింగ్, యాక్టింగ్, ప్రొడక్షన్ - ఫస్ట్ సినిమాకే చాలా చేస్తున్న అనంతపురం అమ్మాయి
మా సినిమాలో కథానాయికగా తెలుగు అమ్మాయిని తీసుకోవాలని ఎంతగానో ట్రై చేశామని, కానీ కుదరలేదని... అప్పుడు ఉత్తరాది అమ్మాయిను తీసుకున్నామని దర్శక నిర్మాతలు చెబుతుంటారు. అందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ... ఈ జనరేషన్ తెలుగు అమ్మాయిలు సైతం యాక్టింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో అనంతపురం అమ్మాయి సమయా రెడ్డి ఒకరు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
'డియర్ ఉమ' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కానున్న అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయా రెడ్డి. ఆమె మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. మంచి అవకాశాల కోసం ఎదురు చూస్తూ... ఏకంగా సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించారు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
'డియర్ ఉమ' సినిమాలో పృథ్వీ అంబర్ హీరో. సుమయా రెడ్డి హీరోయిన్. కేవలం ఆమె నటనకు మాత్రమే పరిమితం కాలేదు. మొదటి సినిమాకు రైటింగ్ విభాగంలో కూడా వర్క్ చేశారు సుమయా రెడ్డి. అంతే కాదు... ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీస్ కూడా చూసుకున్నారు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
రచన, నటన, నిర్మాణం... మొదటి సినిమాకే మూడు విభాగాలను హ్యాండిల్ చేస్తూ తాను మల్టీటాలెంటెడ్ అని సుమయా రెడ్డి ప్రూవ్ చేసుకున్నారు. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. (Image Courtesy: sumaya_reddy / Instagram)
దర్శ కేంద్రులు కె రాఘవేంద్ర రావుతో సుమయా రెడ్డి. (Image Courtesy: sumaya_reddy / Instagram)
'డియర్ ఉమ' టీం త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మూవీతో సుమయ తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించి అందరినీ ఆకట్టుకోనున్నారు. అందంతో, నటనతో మున్ముందు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి సుమయా రెడ్డి. బ్యూటీ విత్ బ్రెయిన్ అని అందరి చేత అనిపించుకునేలా ఉన్నారు. (Image Courtesy: sumaya_reddy / Instagram)
సుమయా రెడ్డి (Image Courtesy: sumaya_reddy / Instagram)
సుమయా రెడ్డి (Image Courtesy: sumaya_reddy / Instagram)